తెలంగాణా సీ ఎం కేసీఆర్ శుక్రవారం బృహత్కరమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఏపీ సీ ఎం జగన్, అలానే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లు కూడా హాజరయ్యారు.
అయితే సీ ఎం జగన్ తో పాటు తెలంగాణా మంత్రి జగదీష్ రెడ్డి కూడా హాజరయ్యారు.అయితే కన్నెపల్లి పంప్ హౌజ్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించిన అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి ఆ పనులను పరిశీలించే క్రమంలో సాయంత్రం 7 గంటల సమయంలో వెళ్లారు.
ఈ క్రమంలో ఆయన లిఫ్ట్ ఎక్కగా అది ఆగిపోయింది.
దీనితో ఆయన లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు.
దీనితో దిగ్బ్రాంతి కి గురైన అక్కడి సిబ్బంది అప్రమత్తమయ్యారు.ఆ లిఫ్ట్ నుంచి మంత్రిగారిని బయటకు తీసే క్రమంలో దాన్ని పగులగొట్టాల్సి వచ్చింది.
అనంతరం ఆయన సురక్షితంగా బయటపడడం తో అందరూ ఊపిరి పిల్చుకున్నారు.

పంప్ హౌజ్ పనులను పరిశీలించడానికి వెళ్లిన ఆయన లిఫ్ట్ ఎక్కగా ఆ లిఫ్ట్ ఆగిపోవడం తో ఆయన దాదాపు అరగంట పాటు లిఫ్ట్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది.అయితే అనంతరం వెంటనే అప్రమత్తమైన ఇంజనీరింగ్ అధికారులు,సిబ్బంది ఆయన క్షేమంగా బయటకు వచ్చేందుకు చర్యలు చేపట్టారు.దీనితో మంత్రి జగదీష్ సురక్షితంగా భయపడడం తో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు.







