రహస్య ఎంగేజ్మెంట్ చేసుకున్న నటి!

రెజీనా కాసాండ్రా ఈ పేరు వినగానే ముందుగా మెగా ఫ్యామిలీ గుర్తుకు వస్తుంది.ఎందుకంటే వరుసగా మెగా హీరోల సినిమా లలో చేస్తూ మెగా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

 Actress Rejina Secret Engagement1-TeluguStop.com

అయితే మెగా నటుడు సాయి ధరమ్ తేజ్ తో రెజీనా ప్రేమలో ఉందంటూ తేరా పుకార్లు షికారు చేయడం తో రెజీనాకు టాలీవుడ్ లో అవకాశాలు కూడా తగ్గిపోయాయి.దీనితో ఇప్పుడు టాలీవుడ్ సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు కానీ ఇతర భాషల్లో మాత్రం అడపా దడపా కనిపిస్తూనే ఉంది.

అయితే ఇప్పుడు తాజాగా ఆమె రహస్యంగా నిశ్చితార్ధం చేసుకుంది అంటూ ఒక వార్త హల్ చల్ చేస్తుంది.ఆమె ఇటీవల సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుంది అంటూ సోషల్ మీడియా లో వార్త హల్ చల్ చేస్తుంది.

అయితే ఈ వార్తలలో ఎంత నిజం ఉందొ అన్న విషయం తెలియదు కానీ ఇప్పుడు ఈ వార్త ఇండస్ట్రీ లో మారు మ్రోగుతుంది.అయితే ఈ వార్త పై ఇంకా సదరు రెజీనా ఇంకా స్పందించలేదు .ప్రస్తుతం కోలీవుడ్ లో ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే పనిలో ఉంది.అటు బాలీవుడ్ లో కూడా ఈ అమ్మడు మెరుస్తుంది.

ఇటీవల అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ చిత్రంలో రెజీనా ఒక కీ రోల్ చేసిన సంగతి తెలిసిందే.ఇప్పుడు బాలీవుడ్ లో మరి కొన్ని ప్రాజెక్ట్స్ లో కనిపించనున్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube