అమెరికాలో భారతీయ మహిళలు తమ సత్తా చాటారు.ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించుకుని అమెరికాలో సంచలనం సృష్టించారు.
అత్యంత ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ తాజాగా అమెరికాలో ఉన్న అత్యంత ధనిక మహిళల జాబితా రూపొందించింది.ఈ జాబితాలో సుమారు 80 మంది మహిళలు చోటు సంపాదించుకోగా ఆ 80 మందిలో సుమారు ముగ్గురు భారతీయ మహిళలకి చోటు దక్కింది0.
తాజాగా ఫోర్బ్స్ అందించిన ఈ జాబితాలో ముగ్గురు భారత సంతతి మహిళలు ఉండటంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.వీరిలో ఒకరు అరిస్టా నెట్‌వర్క్స్ సీఈవో జయశ్రీ ఉల్లాల్, రెండు సింటెల్ సహా వ్యవస్థాపకురాలు నీరజా సేథీ, మూడు కన్‌ప్లయెంట్ టెక్నాలజీ కంపెనీ సహ వ్యవస్థాపకురాలు నేహా నార్కేడే ఉన్నారు.ఇదిలాఉంటే ఈ ముగ్గురిలో ఏబీసీ సప్లై సంస్థ చైర్‌పర్సన్ డయానే హెండ్రిక్స్ సుమారు రూ.4 లక్షల కోట్ల సంపాదనతో మొదటి స్థానంలో నిలిచారు.

జయశ్రీ ఉల్లాల్ రూ.97 వేల కోట్లతో 18 వ స్థానంలో నిలువగా.23వ స్థానంలో నీరజా సేథీ నిలిచి రూ.35 వేల కోట్ల తో 60వ స్థానంలో ఉన్నారు.నేహా నార్కేడ్ సంపాదన దాదాపు రూ.24 వేల కోట్లుగా ఉంది.అయితే ఫోర్బ్స్ ప్రకటించిన ఈ జాబితాలో భారతీయ మహిళలు చోటు దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని స్థానంకంగా ప్రవాసీయులు అంటున్నారు.







