అగ్ర రాజ్యం, పెద్దన్న, ఇలా ఎన్నో పేర్లతో పిలువబడే, కీర్తించబడే అమెరికా అంటే ఎలాంటి దేశమైన సరే కిమ్మనకుండా ఉండాల్సిందే.అత్యంత ధనిక దేశంగా, ప్రపంచాన్ని శాసించే విధంగా ఉన్న అమెరికా ఇప్పుడు ఒకే ఒక కారణంచే నవ్వుల పాలవుతోంది.
పెద్దన్న దేశంలో ఇలాంటి పరిస్థితా అంటూ నవ్వుకుంటున్నారు, ఇంతకీ అంతగా నవ్వుల పాలవడం వెనుక కారణం ఏమిటి.?? వేలెత్తి చూపించుకునే పరిస్థితి ఎందుకు నెలకొంది అనే వివరాలోకి వెళ్తే.

అమెరికాలోని అతిపెద్ద నగరాలలో రెండవది లాస్ ఏంజిల్స్.ఈ పేరు చెప్పగానే చటుక్కున అందరికి గుర్తొచ్చేది హాలివుడ్ సినిమాలు.అవును హాలీవుడ్ సినిమాలకి నెలవైన ఈ నగరంలో కనీసం ఇళ్ళు లేని వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది.గత ఏడాది కంటే కూడా వారి సంఖ్య దాదాపు 12 శాతం పెరిగిందని అక్కడి ఓ సర్వే తెలిపింది.
ఎక్కువగా అక్కడ నిరుపేదలు, నిరక్ష్య రాస్యులు ఉంటున్నారని, స్థానికంగా ఉండే వీధుల్లో గుడారాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారని లాస్ ఏంజిల్స్ హోమ్ లెస్ సర్వీస్ అథారిటీ తన నివేదికలో తెలిపింది.
దాదాపు నిత్యం 60 వేలమంది ప్రజలు పుట్ పాత్ లపై, పార్కుల్లో తల దాచుకుంటున్నారని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సు షెల్టర్ లలో పడుకుంటున్నారని తెలిపింది ఈ సంస్థ.
మరీ ముఖ్యంగా డౌన్ టౌన్ లలో వీరి సంఖ్య అధికంగా ఉందని స్పష్టం చేసింది.ప్రపంచంలోనే అత్యంత ప్రముఖమైన నగరాల్లో ఒక్కటైన ఈ నగరంలో అందులో అమెరికాలో ఈ పరస్థితి ఏమిటని పలువురు నోళ్ళు వెళ్ళబెడుతున్నారు
.






