ఏపీ నూతన ముఖ్యమంత్రిగా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ముందుగా అభివృద్ధి పనులు పక్కన పెట్టి, రాష్ట్రంలో పెరిగిన అనోసరమైన ఖర్చులపై దృష్టి పెట్టారు.ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఏపీ ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించడానికి కేటాయించిన భవనాలను తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని సీ ఎం జగన్ భావించారు.
ఈ నేపథ్యంలో ఆ భవనాలను తెలంగాణా ప్రభుత్వానికి అప్పగిస్తూ గవర్నర్ నరసింహన్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు.రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణా,ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలకు తమ ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించడం కోసం అని ప్రభుత్వ భవనాలను చేరి సగం కేటయించారు.
అయితే ఏపీ ప్రభుత్వం పూర్తిగా అమరావతికి తరలిపోయినప్పటికీ ఇంకా హైదరాబాద్ లో ఉన్న ఏపీ కి ఉన్న అన్ని ప్రభుత్వ భవనాలకు కరెంట్ బిల్లులు,ఇతర పన్ను లు చెల్లించాల్సి వస్తుంది.ఈ క్రమంలో ఉపయోగం లో లేని ఆ భవనాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ఆదివారం గవర్నర్ ని కోరడం తో గవర్నర్ తన కున్న అధికారాలతో ఆ భవనాలను తెలంగాణా సర్కార్ అప్పగించాలి అంటూ ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీలో కొత్తగా ఏర్పడిన జగన్ ప్రభుత్వంతో సానుకూల వాతావరణంలో చర్చలు ప్రారంభించారు.అలాగే ఇఫ్తార్ విందు సందర్భంగా గవర్నర్ సమక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించుకున్నారు.అయితే ఖర్చులను తగ్గించాలని భావించిన ఏపీ సి ఎం ఇక ఆ భవనాలను తెలంగాణా సర్కార్ కు అప్పగించాలని నిర్ణయించుకున్నారో ఏమో.వారి చర్చలు తరువాతే తెలంగాణా క్యాబినెట్ గవర్నర్ ని కోరడం దానికి గవర్నర్ వెంటనే ఉత్తర్వులు జారీ చేయడం అన్నీ జరిగిపోయాయి.అయితే ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగానికి ఒక భవనం, ఇతర కార్యాలయాలకు మరొక భవనం కేటాయించనున్నట్లు కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.







