ముఖ్యమంత్రిగా పరిపాలన మొదలెట్టిన జగన్ ఆరంభంలోనే తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు.టీడీపీ ప్రభుత్వం హయంలో మొదలెట్టిన ప్రాజెక్ట్ టెండర్ లని రద్దు చేస్తూ అన్ని పెండింగ్ లో పెట్టేసాడు.
ఏపీలో నిధుల కొరత కారణంగా ఇప్పట్లో వాటిని మొదలెట్టే అవకాశం లేదనే తేల్చేసాడు.మరో వైపు అప్పట్లో వైఎస్ఆర్ మొదలెట్టిన స్కీమ్స్ కి పేర్లు మార్చి తమ స్కీమ్స్ క్రింద పెట్టుకున్న వాటిని జగన్ మళ్ళీ పేర్లు మార్చేసి అన్నింటికీ వైఎస్ఆర్ పేర్లు పెడుతున్నారు.
దీంతో పరిపాలనతో పాటు సంక్షేమం అంతా వైసీపీ మార్క్ కనిపించాలని అనుకుంటున్నాడు.
ఇదిలా ఉంటే గతంలో టీడీపీ ప్రభుత్వం ఏపీలో సిబిఐపై నిషేధం విధిస్తూ జీవో జారీ చేసింది.
సిబిఐని రాష్ట్రంలో అనుమతి లేకుండా ఆ జీవోతో కట్టడి చేసే ప్రయత్నం చేసింది.తాజాగ మూడు రోజులల్లో ఉన్నతాధికారులు అందరిని బదిలీ చేసి తనకి అనుకూలమైన వారిని నియమించుకున్న జగన్ గత ప్రభుత్వంలో సిబిఐకి వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను రద్దు చేస్తున్నారు.
సంప్రదాయ పద్ధతికి అనుమతిస్తూ జగన్ మళ్ళీ నిర్ణయం తీసుకున్నారు.మరో వైపు అన్ని స్కీంలలో ఉన్న లొసుగులని కూడా ముఖ్యమంత్రి జగన్ వెలికి తీసే పనిల్లో ఉన్నాడని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.







