రోగ్ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన కుర్ర హీరో ఇషాన్.కర్నాటకలో బడా ప్రొడ్యూసర్ సిఆర్ మనోహర్ తమ్ముడుగా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్ర హీరోని పూరీ జగన్నాథ్ హీరోగా పరిచయం చేసాడు.
అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ కాకపోవడంతో ఈ కుర్ర హీరోని టాలీవుడ్ లో ఎవరు పట్టించుకోలేదు.ఇక కన్నడ ఇండస్ట్రీలో కూడా ఈ హీరోకి అవకాశాలు రాలేదు.
అయితే చాలా గ్యాప్ తర్వాత మరల ఈ హీరో తెరపై కనిపించబోతున్నాడు.అయితే ఈ సారి అతను విలన్ గా దర్శనం ఇస్తాడని తెలుస్తుంది.
రవితేజ హీరోగా ఆర్ఎక్స్ 100 చిత్రంతో దర్శకుడుగా పరిచయం అయిన అజయ్ భూపతి దర్శకత్వంలో మహా సముద్రం అనే సినిమా ఒకే అయ్యింది.ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో విలన్ గా రోగ్ హీరో ఇషాన్ విలన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే ఆది పినిశెట్టి హీరో నుంచి విలన్ గా మారి మెప్పించాడు.
ఇక తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా తెలుగులో విలన్ గా కనిపించబోతున్నాడు.ఈ నేపధ్యంలో విలన్ టర్న్ హీరో ఏ మేరకు తన విలనిజంతో మెప్పిస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.







