తెలుగు రాష్ట్రాలలో ఈ రోజు జరిగిన లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ సాయంత్రం ఐదు గంటలకి ముగిసింది.మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలలో నాలుగు గంటలకే పోలింగ్ ముగించిన ఎన్నికల సంఘం.
మిగిలిన చోట్ల మాత్రం ఐదు గంటల వరకు సమయం ఇచ్చింది.ఇక ఐదు గంటల లోపు పోలింగ్ కోసం వచ్చి లైన్ లో ఉన్నవాళ్ళని మొత్తం పూర్తయ్యేంత వరకు ఓటింగ్ కి అనుమతి ఇస్తున్నారు.
ఇక తెలంగాణలో సుమారు 65 శాతం వరకు ఐదు గంటల సమయానికి పోలింగ్ జరిగింది.ఇక ఏపీలో కూడా అన్ని నియోజకవర్గాలలో సరాసరి 60 నుంచి 65 శాతం వరకు పోలింగ్ జరిగింది.
ఇక అతి తక్కువగా విశాఖపట్నంలో పోలింగ్ జరిగినట్లు తెలుస్తుంది.

ఉదయం పోలింగ్ మిషన్ లు చాలా చోట్ల మొరాయించడంతో పోలింగ్ తక్కువగా నమోదైంది.అయితే మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా ఓటర్స్ ఎక్కువగా రావడంతో ఊహించిన దానికంటే పోలింగ్ శాతం పెరగడం విశేషం.ఇక గత ఎన్నికలలో కంటే ఈ సారి ఎక్కువ పోలింగ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.