ఉమ్మది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించినపుడు అప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆలోచన ఒకటే.ఏపీని రెండుగా విభజిస్తే ఆంధ్రాలో అధికారంలోకి రాకున్న తెలంగాణలో కాంగ్రెస్ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది.
తెలంగాణ రాజకీయాలు కాంగ్రెస్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటాయి.ఇక టీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం కాక తప్పదు అనే కుటిల ఆలోచనతోనే రాష్ట్రాన్ని రెండుగా విభజించింది.
ఇక సోనియా ఆలోచనలకి ఆజ్యం పోసింది కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలే కావడం విశేషం.

విభజన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అయిపోవచ్చు అని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎవరికి వారే కలలు కంటూ వచ్చారు.అయితే వారి ఆశలు అడియాశలు చేస్తూ విభజన క్రెడిట్ అంతా టీఆర్ఎస్ కి చేరిపోయి ఆ పార్టీ అధికారంలోకి వచ్చేసింది.దీంతో సోనియా గాంధీకి ఊహించని షాక్ తలిగింది.
ఇక ముఖ్యమంత్రి అయిపోవాలని కలలు కన్నా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలకి కూడా షాక్ తగిలింది.దీంతో ఆ పార్టీ తరుపున గెలిచినా ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా టీఆర్ఎస్ లోకి చేరిపోతూ వచ్చారు.
ఇక పూర్తిగా ఏపీ మీదనే ద్రుష్టి పెట్టిన తెలుగుదేశం పార్టీ తరుపున గెలిచినా ఎమ్మెల్యేలు అందరూ టీఆర్ఎస్ లోకి చేరిపోయారు.

అయితే తాజాగా జరిగిన ఎన్నికలలో మళ్ళీ టీఆర్ఎస్ మీద వ్యతిరేకత తమని అధికారంలోకి తీసుకొస్తుందని కాంగ్రెస్ పార్టీ భావించింది.ఇక తెలంగాణలో ఎంతో కొంత వరకు పార్టీని కాపాడుకోవచ్చని టీడీపీ కూడా ఓ 12 స్థానాలలో పోటీ చేసింది.అయితే ఈ సారి కూడా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ నేతలని నమ్మలేదు.
ఆ పార్టీకి కేవలం 18 సీట్లు మాత్రమే ఇచ్చారు.ఇక టీడీపీని రెండు స్థానాలకి పరిమితం చేసారు.
ఎన్నికలలో గెలిచినా తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష మొదలెట్టింది.ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదని చెప్పి ఆ పార్టీ తరపున గెలిచినా ఎమ్మెల్యేలని తమ పార్టీలో కలిపెసుకుంటున్నారు.
దీంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పార్టీనటుని వీడుతున్న ఎమ్మెల్యేలని కాపాడుకోలేక చేతులు కట్టుకోవాల్సి వచ్చింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా తెలంగాణలో బలపడే ప్రయత్నం చేస్తున్న బీజేపీ కూడా ఆపరేషన్ ఆకర్ష మొదలెట్టి కాంగ్రెస్ సీనియర్ నేతలని ఒక్కొక్కరిగా తనవైపు లాక్కుంటుంది.ఇప్పటికే కొంత మంది టీఆర్ఎస్ వైపు, మరికొంత వైపు బీజేపీ వైపు వెళ్ళిపోయారు.ఇక పార్టీలో సీనియర్ నేతలు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు.
తాజాగా సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ కూడా కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి వెళ్ళిపోవడానికి రెడీ అయ్యారు.మొత్తానికి టీఆర్ఎస్ దెబ్బకి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయే పరిస్థితికి వచ్చేసింది.







