తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచార హోరు జోరుగా సాగుతుంది.తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ ఎలా అయిన మెజారిటీ సీట్లు సొంతం చేసుకొని కేంద్రంలో చక్రం తిప్పాలనే లక్ష్యంతో ఉంది.
ఇందులో భాగంగా ఓ వైపు కేసీఆర్, మరో వైపు, కేటీఆర్, ఇంకో వైపు హరీష్ రావు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.తాజాగా ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుకు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
తూప్రాన్‌లో హరీశ్‌రావు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
రోడ్ షోలో హరీశ్‌రావు ప్రసంగిస్తుండగా వాహనంలోని జనరేటర్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.
దీంతో ఆయన అర్ధాంతరంగా ప్రసంగాన్ని ఆపి వాహనం నుంచి దిగి వెళ్లిపోయారు.హరీష్ రావుతోపాటు ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్‌లు కూడా వాహనం దిగి దూరంగా వెళ్లారు.
అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
.






