ఎన్నికల ప్రచారానికి ముందు వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరో హత్య చేసిన సంగతి తెలిసిందే.అయితే దీనిపై ఓ వైపు సిట్ విచారణ జరుగుతూ ఉండగానే మరో వైపు టీడీపీ, వైసీపీ పార్టీలు వైఎస్ వివేకానంద హత్యని రాజకీయంగా వాడుకుంటూ విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి.
గత కొంత కాలంగా జరుగుతున్నా ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకా హత్యానే ప్రధానాంశంగా మారింది.ఈ ఇష్యూని రాజకీయంగా వాడుకొని లబ్ది పొందాలని అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
ఈ నేపధ్యంలో తాజాగా వైఎస్ వివేకానంద హత్యాని రాజకీయంగా వాడుకోవడంపైన సిట్ విచారణపైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ వివేకానంద సతీమణి హై కోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసారు.
తాజాగా ఈ పిటీషన్ మీద విచారణ చేపట్టిన హైకోర్ట్ ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలకి వార్నింగ్ ఇస్తూ అల్టిమేటం జారీ చేసింది.ఏపీలో ఎన్నికలు అయ్యేంత వరకు ఎ ఒక్క పార్టీ వైఎస్ వివేకానంద హత్యని రాజకీయ విమర్శల కోసం వాడుకోకూడదని, దీనికి అంగీకరిస్తూ లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.ఒక వేళ కోర్ట్ తీర్పుని అతిక్రమించి విమర్శలు చేసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని కూడా హెచ్చరించింది.
ఈ నేపధ్యంలో అలాగే సిట్ విచారణలో ఎవరు వేలు పెట్టె ప్రయత్నం చేయకూడదని కూడా స్పష్టం చేసింది.
హై కోర్ట్ తీర్పు నేపధ్యంలో రాజకీయ పార్టీలు ఇప్పుడు వైఎస్ వివేకానంద హత్యాని తమ పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకోవాలనే వ్యూహానికి అడ్డుపడింది అని చెప్పాలి.మరో పది రోజులలో ఎన్నికలు ఉన్న నేపధ్యంలో హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలు పార్టీలకి కొంత గందరగోళం గురిచేసే అంశమే అని చెప్పాలి.