టీడీపీ ప్రచార వ్యూహం వైసీపీకి కలిసొస్తుందా ?

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కకుండా చేయాలనే ఆలోచనతో నిర్విరామంగా కష్టపడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కులాలవారీగా, మతాల వారీగా ఓట్లను రాబట్టుకునేందుకు కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తున్నాడు.అందులో భాగంగానే జాతీయ స్థాయి నాయకులను ఎన్నికల ప్రచారానికి దింపుతూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

 Will Tdp Propaganda Strategy Favours Ycp-TeluguStop.com

ఎప్పుడూ కష్టపడనంత స్థాయిలో కష్టబడుతూ అన్ని రకాల అస్త్రాలను ఉపయోగిస్తూ బాబు ముందుకు వెళ్తున్నాడు.ఏపీలో వైసీపీకి అనుకూల ఫలితాలు ఉండబోతున్నాయి అనే సంకేతాలు వస్తున్న తరుణం లో క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేసిన చంద్రబాబు మూడు నెలలుగా ఎన్నికల్లో విజయం సాధించడమే అనేక సంక్షేమ పథకాలు ప్రకటించి అమలుచేస్తున్నాడు.

సరిగ్గా ఎన్నికల ముందు పింఛన్ల పెంపు, అన్నదాత సుఖీభవ, పసుపు కుంకుమ తదితర పథకాలను అమలుచేస్తూ డ్వాక్రా మహిళలను, రైతులను, వృద్ధులను ఆకట్టుకోవడం ద్వారా ప్రభుత్వ అనుకూలత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు.మోదీ, జగన్, కేసీఆర్ కలిసి ఏపీపై కుట్రలు చేస్తున్నారని బాబు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు.

వివేకానందరెడ్డి హత్య జగనే చేయించాడనే మరో ఆరోపణతో జగన్ అధికారంలోకి వస్తే ప్రజలకు రక్షణ ఉండదని ఒక భయం కలిగిస్తున్నారు.ఇక్కడితో సరిపెట్టకుండా ఏపీలో ఎన్నికల ప్రచారానికి జాతీయ నాయకులను ఏపీలో ఎన్నికల ప్రచారానికి దింపుతున్నారు.

యూపీఏలో, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీల నేతలను రాష్ట్రంలో తన తరపున ప్రచారం చేయిస్తున్నారు.

ఇప్పటికే జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాను ముస్లింలు అధికంగా ఉండే కడప, కర్నూలు జిల్లాల్లో ప్రచారం చేయించారు.ఆయనే కాకుండా మరికొంతమంది నాయకులను రంగంలోకి దింపేందుకు సిద్ధం అయ్యారు.ఢిల్లీ సీఎంకేజ్రీవాల్ తో విజయవాడ, విశాఖపట్నంలో ప్రచారం చేయించాలని చూస్తున్నాడు.

అలాగే అఖిలేష్ యాదవ్,, తేజస్వీ యాదవ్ లతో ప్రచారం చేయించి యాదవులు ఓట్లను కొల్లగొట్టాలని చూస్తున్నాడు.మమతా బెనర్జీని సైతం తీసుకువచ్చి విశాఖపట్నంలో ప్రచారం చేయించాలనుకుంటున్నారు.కర్ణాటక నుంచి దేవగౌడ ప్రచారానికి వస్తానని ప్రకటించారు.టీడీపీ ఇంతమందితో ఎన్నికల ప్రచారం చేయించాలని చూస్తుండగా ఇదే అంశాన్ని ఉపయోగించుకుని వైసీపీ లాభపడాలని చూస్తోంది.

బాబుకు అనుకూలంగా జాతీయ నేతలంతా ప్రచారానికి వస్తే ఒక్క జగన్ ను ఎదుర్కోవడానికి ఇంత మంది వస్తున్నారు, కానీ జగన్ ఒంటరిగానే వీరందరిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు అనే ప్రచారాన్నిపెద్ద ఎత్తున చేసి జగన్ హీరోయిజాన్ని హైలెట్ చేసే ప్రయత్నంలో వైసీపీ ఉంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube