అంతర్జాతీయ సంస్థ థెస్సాల్స్ క్యాపిటల్ లో భారత సంతతి వ్యక్తి రిషి భాగారియా భాగస్వామి అయ్యాడు.రికార్డ్ సృష్టించాడు.
అతి చిన్న వయసులో ఈ ఘనత సాధించిన వ్యక్తిగా అతడు రికార్డులకెక్కాడు.ఆ వివరాలలోకి వెళ్తే.
అతడి పేరు రిషి భాగారియా 18 ఏళ్ల కుర్రాడు.అతడు ఎనిమిదో తరగది చదువుతున్న సమయంలోనే స్టాక్ మార్కెట్ పై పట్టు సాధించాడు.
ఈ క్రమంలో అతడికి తన సోదరుడు, ఓ వ్యక్తి సలహాలు ఇచ్చేవారని వారు ఇద్దరు కూడా పేరొందిన స్టాక్ మార్కెట్ కంపెనీలలో సలహాదారులుగా పని చేస్తున్నారని అతడు చెప్పాడు.వారి ప్రోద్భలం వల్లే తాను అతి చిన్న వయసులో అంతర్జాతీయ సంస్థ థెస్సాల్స్ క్యాపిటల్లో భాగస్వామిని అయ్యానన్నాడు.
ఇదిలాఉంటే థెస్సాల్స్ సంస్థ ఎండీ మైకేల్ మాట్లాడుతూ రిషి గొప్ప ప్రతిభ దాగి ఉందని అన్నారు.ఇంత చిన్న వయసులో స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై పట్టు సాధించడం అంటే మాములు విషయం కాదని భవిష్యత్తులో రిషి ఎన్నో ఉన్నత స్థానాలని అధిరోహిస్తారని ఆయన తెలిపారు.
తాజా వార్తలు