130 మందితో టీడీపీ మొదటి జాబితా సిద్ధం!

అధికార పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించి అసెంబ్లీ అభ్యర్ధులని ప్రకటించే పని మొదలెట్టేసారు.అన్ని నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు పూర్తి చేసిన చంద్రబాబు మొత్తం 130 మందితో కూడా మొదటి అసెంబ్లీ అభ్యర్ధుల జాబితాని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.

 Chandrababu Naidu Ready To Announce First List Of Candidates-TeluguStop.com

ఇక వీళ్ళంతా నియోజకవర్గాలలో ప్రజల మధ్యకి వెళ్లి ప్రచారానికి శ్రీకారం చుట్టాలని చంద్రబాబు నుంచి వారికి స్పష్టమైన ఆదేశాలు కూడా వెళ్ళినట్లు తెలుస్తుంది.ఇక 25 పార్లమెంట్ అభ్యర్ధులని కూడా చంద్రబాబు ఖరారు చేసినట్లు తెలుస్తుంది.

ఇదిలా వుంటే చాలా వరకు సిట్టింగ్ లకే మళ్ళీ అవకాశం ఇచ్చిన చంద్రబాబు గత ఎన్నికలలో టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్ధులని పక్కన పెట్టి, వారి తరుపున వైసీపీలో గెలిచి టీడీపీలోకి వచ్చిన వారికి పెద్ద పీట వేసారు.ఈ నేపధ్యంలో చాలా నియోజక వర్గాలలో అధికార పార్టీ మీద టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు అసంతృప్తితో వున్నారు.

అయితే ఇలాంటి అసంతృప్తుల నుంచి పార్టీకి నెగిటివ్ ఓటు వచ్చే అవకాశం వున్న నేపధ్యంలో చంద్రబాబు ముందస్తుగా ఓ కమిటీ ఏర్పాటు చేసి అసంతృప్తులని భుజ్జగించే ప్రహసనంకి శ్రీకారం చుడుతున్నారు.ఇక తిరుపతి నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారం మొదలవబోతుంది అని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube