జయలలిత మృతిలో సంచలన సీక్రెట్స్ బయట పెట్టిన తమిళనాడు మంత్రి!

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ జయలలిత మరణించి ఇప్పటికే రెండేళ్ళ దగ్గర అవుతుంది.అయితే హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మరణించిన జయలలిత మృతి వెనుక చాలా రహస్యాలు దాగి వున్నాయని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 Tamil Nadu Minister Sensational Comments On Jayalalitha Death-TeluguStop.com

ఆమె మరణం తర్వాత తమిళనాడులో జరిగిన సంఘటనలు కూడా జయలలిత మరణంలో ఏవో సీక్రెట్స్ వున్నాయి అనేదానికి బలం చేకూర్చాయి.ఆమెది సహజ మరణం కాదని, ఆమెని హత్య చేసి చంపేశారని చాలా మంది వాదించారు.

అయితే వాటికి కూడా ఆధారాలు లేవు.

ఇదిలా వుంటే తాజాగా తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ నేత, న్యాయశాఖమంత్రి సివి షణ్ముగం సంచలన వాఖ్యలు చేసారు.

జయలలిత మరణం ముమ్మాటికి హత్యే అని అన్న అతను ఆమెకి షుగర్ వుందని తెలిసి హల్వా ఇచ్చి వ్యాధి ముదిరేలా చేసి చంపేశారని వాఖ్యానించారు.దానిని సహజసిద్ధమైన మరణంగా చిత్రీకరించారని ఆరోపించారు.

శశికళని పూర్తిగా విచారిస్తే జయలలిత మరణం వెనుక నిజాలు బయటపడతాయని షణ్ముగం చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube