అమ్మాయిలు మెచ్యూర్‌ అయితే శారీ ఫంక్షన్‌ చేస్తాం.. ఇప్పుడు బ్రిటన్‌లో కూడా పీరియడ్‌ పార్టీలు

ఇండియాలో ఎక్కువగా తెలుగు, తమిళులు అమ్మాయిలు మెచ్యూర్‌ అయితే ఫంక్షన్స్‌ చేస్తూ ఉంటారు.అంటే అమ్మాయికి మొదటి సారి పీరియడ్‌ వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఫంక్షన్స్‌ నిర్వహిస్తారన్నమాట.

 The Periods Parties Will Conducted In Britain-TeluguStop.com

అమ్మాయిలు రజస్వల అవ్వడం అంటే అమ్మ అయ్యేందుకు సిద్దం అయ్యిందని అర్థం.ఆ విషయాన్ని బంధు మిత్రులతో కలిసి ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు.

అయితే ఈమద్య కాలంలో ఉన్నత శ్రేణి వారు ఈ ఫంక్షన్స్‌ను నిర్వహించడం లేదు.రజస్వల ఫంక్షన్‌ అనకుండా శారీ ఫంక్షన్‌ అంటూ డబ్బున్న వారు పేరు మార్చి చేస్తున్నారు.

అయితే ఊర్లలో మాత్రం పెద్దమనిషి అయిన ఫంక్షన్‌ అని, అమ్మాయి రజస్వల అయిన ఫంక్షన్స్‌ అంటూ నిర్వహిస్తూ ఉంటారు.

తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, ఇంకా కొన్ని చోట్ల మాత్రమే కనిపించే ఈ పద్దతి ఇప్పుడిప్పుడే బ్రిటన్‌లో కూడా మొదలు అవుతుంది.బ్రిటన్‌లో అమ్మాయిలు మెచ్యూర్‌ అయిన సమయంలో పీరియడ్‌ పార్టీ అంటూ నిర్వహిస్తున్నారట.పీరియడ్‌ పార్టీలకు అమ్మాయిల స్నేహితులు మరియు బంధువులు కూడా హాజరు అవుతున్నారట.

ఈమద్య కాలంలో బ్రిటన్‌లో ఎక్కువగా ఇలాంటి పార్టీలు జరుగుతున్నాయట.ఈ పార్టీలకు ఎక్కువగా ఎరుపు రంగు వంటలను మరియు ఎరుపు రంగు దుస్తులను వాడుతూ ఉన్నారట.

బ్రిటన్‌లో మొదటి సారి 2016లో పీరియడ్‌ పార్టీలు జరిగాయట.అయితే 2018 నుండి అవి ఎక్కువ అయ్యాయి.

బ్రిటన్‌లో కొంత కాలం ముందు వరకు నెలసరి వచ్చిన అమ్మాయిలు, ఆడవారు తమ తమ రోజు వారి జీవితాలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టే వారట, అంటే స్కూల్‌కు, కాలేజ్స్‌కు వెళ్లాల్సిన అమ్మాయిలు వెళ్లకుండా, ఆఫీస్‌లకు వెళ్లాల్సిన ఆడవారు ఆఫీస్‌లకు వెళ్లకుండా సెలవులు పెట్టి ఇంటి వద్దే ఉండేవారట.అయితే పీరియడ్‌ పార్టీలు ప్రారంభం అయినత ర్వాత ఆ పద్దతి మారిందని, పీరియడ్స్‌ విషయంలో బ్రిటన్‌లో ఎక్కువగా అవగాణ కల్పించేందుకు కొన్ని స్వచ్చంద సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇక అక్కడ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న అమ్మాయిలకు ప్యాడ్స్‌ కూడా అందించేందుకు సదరు సంస్థలు ముందుకు వచ్చాయట.ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆడవారు పీరియడ్స్‌ సమయంలో చిన్న చూపుకు గురి అవుతున్నారని, వారిని ఆ సమయంలో మరింత ప్రేమతో చూపించాలని నిపుణులు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube