ప్రతి రాజకీయ పార్టీ….నాయకుడు…ఇలా అంతా ఇప్పుడు ఎన్నికల హడావుడిలో బిజీబిజీగా ఉన్నారు.ఎత్తులు – పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థి పార్టీలను మట్టికరిపించి పనిలో భాగాంగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు.జనం నాడి తెలుసుకుంటూ… వారిని బుట్టలో వేసుకునే పనిలో పడ్డారు.
ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు అదే పనిలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు.

కొత్త కొత్త పథకాలతో పాటు … పక్క పార్టీల ఎన్నికల మ్యానిఫెస్టో ను సైతం కాఫీ కొట్టి మరీ అమలు చేస్తున్నాడు.అంతే కాదు … ఒక పక్క అభివృద్ధి , శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, కొత్త కొత్త పధకాలు అమలు చేయడం … మరోపక్క ఢిల్లీ పర్యటనలు ఇలా ఏ విషయంలోనూ… వెనక్కి తగ్గకుండా… ముందుకు వెళ్తున్నాడు.ఈ విషయంలో కొంచెం వెనకబడిపోయిన వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు హడావుడిగా.
టీడీపీని దాటుకుని ముందుకు వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.
సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల్లోనే ఉన్న జగన్ గడిచిన 20 రోజులుగా ప్రజలకు దూరమై హైదరాబాద్ లో పార్టీ పనుల్లో బిజీగా ఉన్నారు.
వివిధ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని సమీక్షిస్తున్న ఆయన కొత్త నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారు.తటస్థులతో ఆయన సమావేశమవుతున్నారు.
పార్టీకి కలిసొచ్చే అంశాలపై అందరితోనూ సంప్రదింపులు జరుపుతున్నారు.ఏం చేస్తే అధికారంలోకి వస్తాం అనే కాన్సెప్ట్ మీదే ఇప్పుడు ఫుల్ ఫోకస్ పెట్టి ముందుకు నడుస్తున్నాడు.
ఎన్నికలకు ఇంకా కొద్ది సమయమే ఉండడంతో… ఫిబ్రవరి మొదటి వారం నుంచి జగన్ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కే పరిమితం కానున్నారు. ఫిబ్రవరీ 4, 5, 6 తేదీల్లో తిరుపతి, కడప, అనంతపురం జిల్లాల్లో పార్టీ బూత్ లెవల్ నాయకులతో ఆయన సమావేశం కాబోతున్నారు.

ఇప్పటికే అమరావతిలో జగన్ నివాసం, పార్టీ కార్యాలయం నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.ఫిబ్రవరి 14న ఆయన గృహప్రవేశం చేయనున్నారు.అప్పటి నుంచి మొత్తం అమరావతిలో ఉంటూనే పార్టీ కార్యక్రమాలు జిల్లాల పర్యటనలో భాగంగానే ఆయన నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని సమీక్షించి చక్కబెట్టనున్నారు.విభేదాలు ఉన్న చోట్ల కూడా నేతలతో చర్చించి బుజ్జగించే పనిలో ఉన్నారు.
నెల రోజుల పాటు పూర్తిస్థాయిలో పార్టీ కార్యక్రమాలు చూసుకోనున్న జగన్ మార్చి మొదటి వారం నుంచి పూర్తిస్థాయిలో ప్రచారం ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.రాష్ట్రవ్యాప్తంగా ఆయన బస్సు యాత్ర నిర్వహించనున్నారు.
ఇందుకుగానూ ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.







