ఇండియాలో ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉందని, ఈ సారి చలితో మనుషుల ప్రాణాలు సైతం పోతున్నాయంటూ వార్తలు చూస్తూ ఉన్నాం.దక్షిణ భారత దేశం విషయం పక్కన పెడితే ఉత్తర భారతదేశంలో చలి చాలా తీవ్రంగా ఉంటుంది.
ఆ విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రత అప్పుడప్పుడు మైనస్‌లలో కూడా పడుతుంది.
కాని దక్షిణ భారతదేశంలో మాత్రం ఉష్ణోగ్రతలు మైనస్‌లోకి వచ్చిన దాఖలాలు లేవు.తెలుగు రాష్ట్రాల్లో సరాసరి తక్కువ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల వరకు ఉంటుంది.
అప్పటికే మనం వామ్మో వాయ్మో అంటాం.అది కూడా కేవలం రెండు నెలలు మాత్రమే ఉంటుంది.
ఆ తర్వాత అంతా మామూలే.కాని అమెరికాలో మాత్రం ఎక్కువ కాలం చలిగానే ఉంటుంది, అది కూడా మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది.
ప్రస్తుతం అమెరికాలో మైనస్ 30 నుండి మైనస్ 55 వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లుగా అక్కడి వాతావరణ శాఖ చెబుతోంది.అక్కడ వాతావరణంతో గత రెండు నెలల్లో ఏకంగా 12 మంది మృత్యువాత పడ్డట్లుగా అమెరిక అధికారికంగా వెళ్లడించింది.
అత్యంత దారుణమైన పరిస్థితులతో అక్కడ ప్రజలు బతకుతున్నారు.మంచు తుఫాన్‌లు మరీ బీభత్సంగా వస్తున్నాయంటూ స్థానిక మీడియా పెద్ద ఎత్తున వార్తలు రాస్తున్న విషయం తెల్సిందే.
ఇక తాజాగా అక్కడి పరిస్థితిని వివరించేందుకు స్థానికుడు ఒక ఫన్నీ ప్రయోగం చేశాడు.ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

అమెరికాలోని వ్యక్తి ఒక పాత్రలో నీటిని వంద డిగ్రీల వేడి వద్ద మరిగించాడు.బాగా మరుగుతున్న ఆ నీటిని బయటకు తీసుకు వచ్చాడు.మన వద్ద మరుగుతున్న నీటి చుక్క ఒక్కటి మీద పడితే పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అక్కడ మాత్రం మరుగుతున్న నీటిని బయటకు తీసుకు వచ్చి పైకి విసిరాడు.
పైకి విసిరిన ఆ నీళ్లు ప్రాక్షన్ ఆఫ్ సెకన్స్ లో మంచుగా మారిపోయింది.స్లో మోషన్ లో తీసిన ఈ వీడియో వీక్షకులను ఆశ్చర్య పర్చుతోంది.
పైకి విసిరిన నీళ్లు మేఘంల మారి పొగ మంచును చూపిస్తూ మంచు బిందువులగా కింద పడ్డాయి.అక్కడి పరిస్థితికి అద్దం పట్టినట్లుగా ఉన్న వీడియోను కింద చూడవచ్చు.
.






