వెంకటేష్, వరుణ్ తేజ్‌ల కాంబోలో మల్టీస్టారర్‌గా తెరకెక్కి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఎఫ్ 2’ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకు పోతుంది.ప్రస్తుతం ఎఫ్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద కుమ్మేస్తోంది.
భారీ అంచనాల నడుమ రూపొందిన ఎఫ్ 2 చిత్రం ఒక మోస్తరు వసూళ్లను అయితే సాధిస్తుందని అంతా నమ్మారు.కాని ఈస్థాయి వసూళ్లు నమోదు అవుతాయని మాత్రం ఎవరు ఊహించలేదు.
దర్శకుడు అనీల్ రావిపూడి ఒక్కసారిగా స్టార్ స్టేటస్‌ను దక్కించుకున్నాడు.
అనీల్ రావిపూడి దర్శకత్వంలో నటించేందుకు ప్రస్తుతం యంగ్ హీరోలు, స్టార్ హీరోలు కూడా ఆసక్తిగా ఉన్నారు.అయితే అనీల్ మాత్రం ఒక హీరోయిన్ ఓరియంటెడ్ ఎంటర్ టైనర్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా ప్రచారం జరిగింది.భారీ అంచనాల నడుమ ఒక హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాన్ని తెరకెక్కించిన తర్వాత ఈ దర్శకుడు మహేష్‌బాబుతో ఒక చిత్రాన్ని చేసే అవకాశం కనిపిస్తోంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్‌బాబుకు అనీల్ రావిపూడి కథను వినిపించాడని, ఆ కథకు మహేష్‌బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం మహేష్‌బాబు తన 25వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నాడు.ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.అతి త్వరలోనే తన 26వ చిత్రంను సుకుమార్ దర్శకత్వంలో చేసేందుకు సిద్దం అవుతున్నాడు.
ఆ సినిమా కోసం మహేష్‌బాబు చాలా స్పెషల్ మేకోవర్‌లో కనిపిస్తాడంటూ ప్రచారం జరుగుతుంది.ఇక ఇప్పుడు మహేష్‌బాబు 27వ చిత్రంగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి.
లేడీ ఓరియంటెడ్ చిత్రంను ఈ ఏడాదిలో పూర్తి చేసి వచ్చే ఏడాది ఆరంభంలో మహేష్‌బాబుతో అనీల్ రావిపూడి మూవీ చేసే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.