తాడిపత్రి ఆశ్రమ వివాదంలో… పోలీసులను జేసీ దివాకర్ రెడ్డి ధూషించిన సమయంలో డిపార్ట్ మెంట్ తరపున గట్టిగా వాయిస్ వినిపించారు మాధవ్.మీసం మెలేసి మరీ జేసీ దివాకర్ రెడ్డికి సవాల్ చేసిన మాధవ్ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించారు.
అందులో భాగంగానే… వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సంప్రదింపులు పూర్తి అవ్వడంతో ఈ రోజు వైసీపీ చేరారు.
ఈ మేరకు కదిరి సర్కిల్ ఇన్ స్పెక్టర్ పదవికి రాజీనామా చేసిన గోరంట్ల మాదవ్ వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరారు.పార్టీ అధ్యక్షుడు జగన్ ఆయన్ను కండువా కప్పి ఆహ్వానించారు.మాధవ్‌తో పాటు ఆయన ప్రాంతానికి చెందిన పలువురు పార్టీలో చేరారు.పోలీస్ అధికారులను అవమానించేలా టిడిపి ఎంపీ దివాకరరెడ్డి మాట్లాడినప్పుడు మాధవ్ తీవ్రం గా స్పందించి జిల్లా వ్యాప్తంగా అభిమానం పొందారు.







