అలా చేస్తే ఇండస్ట్రీలో అవకాశాలు రావు...కానీ నాకు ఆఫర్లు రాక పోయినా పర్లేదు..! మీరు మాత్రం.?

వినోదం కి మనం అత్యంత ప్రాముఖ్యత ఇస్తాము అనడంలో అతిశయోక్తి ఏం లేదు అనుకుంట.

గురు, శుక్రవారాలు వస్తే చాలు రాత్రి ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాము.

అంతలా వీక్షిస్తాము మనం “జబర్దస్త్” ప్రోగ్రాం ను.ముక్యంగా “హైపర్ ఆది” స్కిట్స్ కి అయితే ఫాన్స్ చాలా మందే అని చెప్పాలి.

యూట్యూబ్ లో వ్యూస్ ఏ దీనికి సాక్షం.ట్రెండ్ అవుతున్న టాపిక్స్ కి తన స్టైల్ లో పంచ్ వేసి అందరిని అలరిస్తుంటాడు.అయితే గత కొన్ని ఎపిసోడ్స్ నుండి హైపర్ ఆది కనిపించట్లేదు.

మధ్యలో ఒకసారి ఆక్సిడెంట్ అయ్యిందంటూ పుకార్లు కూడా వచ్చాయి.సినిమాల్లో బిజీగా ఉన్నాడని మరికొందరు అనుకున్నారు.

Advertisement

కానీ హైపర్ ఆది జనసేన పార్టీ తరుపున ఎన్నికల ప్రచారంలో బిజీ గా ఉన్నాడు.అతను పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద ఫ్యాన్ ఓ అందరికి తెలిసిందే.తాజాగా పాలకొల్లులో జనసేన యూత్ ఫోర్స్‌తో సమావేశం అయిన ఆది ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు."2009లో రాజకీయాల్లోకి వచ్చిన మంచి వ్యక్తిని అందరూ ముంచేశారు.2019లో వస్తున్న వ్యక్తి మంచితనంతో పాటు మొండితనం కలిగినవాడు.తాడోపేడో తేల్చుకునే వ్యక్తి.

పవన్‌కళ్యాణ్‌కు ఎలక్షన్లయినా, కలెక్షన్లయినా రికార్డులు బద్దలు కొట్టడమే తెలుసు.బేసిగ్గా ఇండస్ట్రీలో ఉండి పాలిటిక్స్ లో ఎవరికైనా సపోర్ట్ చేస్తే ఆఫర్లు రావు అంటారు.

నాకు ఆఫర్లు రాక పోతే నేను వెళ్లి నా జాబ్ చేసుకుంటా.మంచి వ్యక్తికి మనం సపోర్ట్ చేయకపోతే ఎప్పటికీ మనం ఇలానే ఉండిపోతామని" హైపర్ ఆది వ్యాఖ్యానించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కులమతాలకు అతీతంగా పవన్‌కళ్యాణ్‌ను సమర్థించాల్సిన అవసరం ఉంది.

షారుఖ్ ఖాన్ ఎందుకు సౌత్ డైరెక్టర్ల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నాడు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 15 గురువారం, 2020

ముగ్గురు వ్యక్తుల్లో ఎవరు మంచివారో ప్రజలు ఆలోచించుకుని మనస్సాక్షిగా ఓటేయాలి అని హైపర్ ఆది అన్నారు.

Advertisement

తాజా వార్తలు