ఇండియాలో జై జవాన్, జై కిసాన్ అంటారు.సైనికుల తర్వాత ఇండియాకు అత్యంత కీలకమైన వారు రైతులు అనేది ఆ నినాదం ఉద్దేశ్యం.
రైతే రాజు, రైతు రాజ్యం ఇలా రైతుల గురించి ఎన్నో మంచి నినాదాలు మన ఇండియాలో ప్రతి రోజు వినిపిస్తాయి.కాని రియాల్టీకి వస్తే మాత్రం రైతును అత్యంత దారుణంగా చూస్తూ ఉంటారు.
రైతులను చాలా నీచంగా చూడటంతో పాటు, వ్యవసాయం చేసుకునే వారు అంటే చిన్న చూపు చూస్తూ, మిడిల్ క్లాస్ లేబర్ వారి మాదిరిగా జనాలు చూస్తున్నారు.
ముఖ్యంగా ప్రభుత్వ అధికారులకు రైతులు కనిపించరు.వారి కళ్లకు బాగా డబ్బున్న వారు, లంచాలు ఇచ్చే వారు మాత్రమే కనిపిస్తారు.ఏదైనా పని చేసి పెట్టమంటే చిల్లరగా చూడటంతో పాటు, లంచం ఇస్తేనే పని చేసి పెడతాం అంటారు.
రైతులను ఇష్టం వచ్చినట్లుగా వాడుకుని వారి జీవితంపైనే విసుగు పుట్టేలా చేస్తున్నారు.
మద్యప్రదేశ్‌కు చెందిన అజిత్ అనే రైతు ట్రాన్స్‌ఫార్మ్ కోసం 40 వేల రూపాయల డీడీ కట్టాడు.డీడీ కట్టిన తర్వాత వెంటనే ట్రాన్స్‌ఫార్మ్ రావాల్సి ఉంది.కాని ప్రభుత్వ అధికారులు మాత్రం మరో పది వేల రూపాయలు లంచం రూపంలో ముట్టజెప్పితేనే ఆ ట్రాన్స్‌ఫార్మ్ వస్తుందని అంటున్నారు.
వేసిన పంట ఎండి పోతుంది, చేతిలో డబ్బు లేక పోవడంతో ట్రాన్స్‌ఫార్మ్ రావడం లేదు.దాంతో ఆ రైతు కన్నీరు మున్నీరు అయ్యాడు.కలెక్టర్‌కు ఈ విషయం తెలియజేసి సమస్య సరిష్కారం చేయించుకోవాలని అజిత్ భావించాడు.తన సమస్యను చెప్పేందుకు ప్రయత్నించగా అసలు కలెక్టర్ వినిపించుకునేందుకు కూడా ఆసక్తి చూపించలేదు.దాంతో అజిత్ కలెక్టర్ కాళ్లపై పడ్డాడు.
అయినా కూడా అజిత్ ఆవేదన వినేందుకు కలెక్టర్ ఆసక్తి చూపించకుండా వెళ్లి పోయాడు.ఈ సంఘటన కొందరు మొబైల్‌లో చిత్రీకరించడంతో సదరు వీడియోలు వైరల్ అయ్యాయి.ఆ రైతుకు న్యాయం చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అయ్యాయి.
ఆ కలెక్టర్‌ను, అధికారులను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ వ్యక్తం అవుతుంది.
.