ఐ ఫోన్ కోసం కిడ్నీనే అమ్ముకున్నాడు ... ఇప్పుడు దీనస్థితిలో ఉన్నాడు

వస్తువులు అంటే పిచ్చి ఉండవచ్చు.కానీ మరీ ప్రాణాల మీదకు తెచ్చుకునే అంత పిచ్చి ఉండడకూడదు.

 China Boy Sold His Kidney For An Iphone 4-TeluguStop.com

అలా ఉంటే జీవితంలో తిప్పలు తప్పవు అని నిరూపిస్తున్నాడు చైనా లోని ఓ యువకుడి.ఇక సెల్ ఫోన్ పిచ్చి అనేది ఈ మధ్య చాలా ముదురుపోయింది.

లేచిన దగ్గర నుంచి.పడుకునే వరకు ఇప్పుడు అందరి చేతుల్లోనూ.

సెల్ ఫోన్ ఉండాల్సిందే.అది లేకపోతే క్షణం కూడా గడవని పరిస్థితికి వచ్చేసారు చాలా మంది.

సలాంటి పిచ్చి ముదిరిపోయి ఇప్పుడు ఓ యువకుడు ఆసుపత్రి బెడ్ మీద దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు.పూర్తి వివరాలు చూస్తే… ఓ 17 ఏళ్ల విద్యార్థి ఐఫోన్ కోసం కిడ్నీ అమ్ముకుని.

ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.చైనాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు హాట్‌టాఫిక్‌గా మారింది.

చైనాలో వాంగ్‌ అనే యువకుడు ఐఫోన్‌ కొనుక్కోవాలనుకున్నాడు… ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో తన కిడ్నీని 3,200 డాలర్లకు అమ్మేశాడు.ఇక తనకు నచ్చిన ఐఫోన్‌ 4 కొనేశాడు.మిగతా డబ్బుతో ఎంజాయ్ చేశాడు.అయితే ఏడేళ్లు తిరిగే సరికి ఆ వ్యవహారం కాస్తా… తిరగబడింది.కిడ్నీ తొలగించేటప్పుడు చేసిన సర్జరీ సక్సెస్ కాకపోవడంతో.ఇన్‌ ఫెక్షన్‌ సోకి ఉన్న మరో కిడ్నీ కూడా పాడైపోయింది.

ఇప్పుడు రెగ్యులర్‌గా డయాలసిస్ చేసుకుంటే తప్ప బతకని పరిస్థితి ఏర్పడింది.

అప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాంగ్ పేరెంట్స్ కష్టపడి ఓ సంవత్సరంపాటు డయాలసిస్ చేయించారు.కానీ, ఆ ఖర్చును వాళ్లు భరించే పరిస్థితి లేకుండా పోయింది.అందివచ్చిన కొడుకు ఆసరాగా ఉంటాడనుకుంటే ఇప్పుడు… పేరెంట్స్ పైనే ఆ యువకుడు ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube