ఐ ఫోన్ కోసం కిడ్నీనే అమ్ముకున్నాడు ... ఇప్పుడు దీనస్థితిలో ఉన్నాడు
TeluguStop.com
వస్తువులు అంటే పిచ్చి ఉండవచ్చు.కానీ మరీ ప్రాణాల మీదకు తెచ్చుకునే అంత పిచ్చి ఉండడకూడదు.
అలా ఉంటే జీవితంలో తిప్పలు తప్పవు అని నిరూపిస్తున్నాడు చైనా లోని ఓ యువకుడి.
ఇక సెల్ ఫోన్ పిచ్చి అనేది ఈ మధ్య చాలా ముదురుపోయింది.లేచిన దగ్గర నుంచి.
పడుకునే వరకు ఇప్పుడు అందరి చేతుల్లోనూ.సెల్ ఫోన్ ఉండాల్సిందే.
అది లేకపోతే క్షణం కూడా గడవని పరిస్థితికి వచ్చేసారు చాలా మంది.సలాంటి పిచ్చి ముదిరిపోయి ఇప్పుడు ఓ యువకుడు ఆసుపత్రి బెడ్ మీద దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు.
పూర్తి వివరాలు చూస్తే.ఓ 17 ఏళ్ల విద్యార్థి ఐఫోన్ కోసం కిడ్నీ అమ్ముకుని.
ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.చైనాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు హాట్‌టాఫిక్‌గా మారింది.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ చైనాలో వాంగ్ అనే యువకుడు ఐఫోన్ కొనుక్కోవాలనుకున్నాడు.
ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో తన కిడ్నీని 3,200 డాలర్లకు అమ్మేశాడు.ఇక తనకు నచ్చిన ఐఫోన్ 4 కొనేశాడు.
మిగతా డబ్బుతో ఎంజాయ్ చేశాడు.అయితే ఏడేళ్లు తిరిగే సరికి ఆ వ్యవహారం కాస్తా.
తిరగబడింది.కిడ్నీ తొలగించేటప్పుడు చేసిన సర్జరీ సక్సెస్ కాకపోవడంతో.
ఇన్ ఫెక్షన్ సోకి ఉన్న మరో కిడ్నీ కూడా పాడైపోయింది.ఇప్పుడు రెగ్యులర్‌గా డయాలసిస్ చేసుకుంటే తప్ప బతకని పరిస్థితి ఏర్పడింది.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
అప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాంగ్ పేరెంట్స్ కష్టపడి ఓ సంవత్సరంపాటు డయాలసిస్ చేయించారు.
కానీ, ఆ ఖర్చును వాళ్లు భరించే పరిస్థితి లేకుండా పోయింది.అందివచ్చిన కొడుకు ఆసరాగా ఉంటాడనుకుంటే ఇప్పుడు.
పేరెంట్స్ పైనే ఆ యువకుడు ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రైతు అవతారమెత్తిన కలెక్టర్.. సీక్రెట్ ఆపరేషన్‌తో స్కామ్ బట్టబయలు!!