రాజమౌళి కొడుకు పెళ్లి వేడుకల్లో...మన స్టార్ కపుల్స్ కి ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటో తెలుసా.?

ఎస్‌.ఎస్‌.

 Rajamouli Son Marriage Surprise Gifts To Star Couples-TeluguStop.com

రాజమౌళి కుమారుడు కార్తికేయ, పూజా ప్రసాద్‌ల వివాహ వేడుక జైపూర్‌లో ఈరోజు జరగనుంది.ఇండ‌స్ట్రీకి సంబంధించిన ప‌లువురు తారలు అక్క‌డికి చేరుకోగా వారి ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

చరణ్, రాజమౌళి, ప్రభాస్ తీన్మార్ డాన్స్ లు చేశారు.ఇక నిన్న రాత్రి జరిగిన పార్టీలో తారక్ స్టేజ్ మీద చేసిన రచ్చ మాములుగా లేదని అంటున్నారు.

దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో హల్చల్ చేస్తోంది.

పెళ్ళికి వచ్చిన అతిథులకు రాజమౌళి కుటుంబం చిరు సర్‌ప్రైజ్‌లు ఇచ్చింది.ఇక్కడ ఇచ్చిన ఫొటోలు చూడండి… ఓ చేతిలో ఎన్టీఆర్‌ ఫ్యామిలీ ఫొటో, ఇంకో చేతిలో నాని దంపతుల ఫొటో ఉన్నాయి కదా! నిజానికి, అవి ఫొటోలు కాదు… స్టార్‌ హోటల్‌ రూమ్‌ కీస్‌ (గది తాళాలు).అతిథులకు కేటాయించిన గదులకు ప్రత్యేకంగా కీస్‌ తయారు చేయించారు.

ఎవరి గదిపై వారి ఫ్యామిలీ ఫొటోలను ముద్రించారు.వీటిని ఎన్టీఆర్‌, నాని సతీమణి అంజనా యలవర్తి ‘బంగారం సేస్‌ ఎస్‌ ఎస్‌’ హ్యాష్‌ట్యాగ్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

‘ఎస్‌ ఎస్‌’ అంటే ఎస్‌.ఎస్‌.

కార్తికేయ, ‘బంగారం’ అంటే పూజా ప్రసాద్‌ అయ్యి ఉండొచ్చు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube