మొదటి స్థానంలో ఒబామా దంపతులు..!!!

అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా తానూ అధికారంలో ఉన్నా లేకపోయినా సరే తనదైన ముద్ర వేయడంలో ముందు వరసలో ఉన్నారు.

అమెరికా ప్రజలని మాత్రమే కాదు ఎన్నో దేశాల ప్రజలు ఒబామాని ఓ మంచి వ్యక్తిగా అభిమానిస్తారు.

ఎన్నో సర్వేలలో సైతం ఒబామా పేరు వినపడేది అయితే తాజా ఓ సర్వేలో అత్యంత గౌరవనీయలైన వ్యక్తుల జాబితాలోకి ఈ సారి ఒబామా, ఆయన సతీమణి మిషెల్ నిలిచారు.

ఓ సర్వే సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడయ్యింది.ఈ సర్వే ప్రకారం.అత్యంత గౌరవనీయమైన పురుషునిగా మాజీ అమెరికా అధ్యక్షుడు ఒరాక్‌ ఒబామా తొలి స్థానంలో నిలిచారు.

ఒబామా 11 ఏళ్ల నుంచి ఈ సర్వేలో మొదటి స్థానంలో కొనసాగుతుండటం గమనార్హం.ఇక మహిళలలో మొట్ట మొదటి సారిగా మిషెల్ మొదటి స్థానం దక్కించుకున్నారు.అయితే

Advertisement

గతంలో ఈ సర్వే రిజల్స్ లో హిల్లరీ మొదటి స్థానంలో ఉండేదని సర్వే వెల్లడించింది.గల్లప్‌ అనే సంస్థ ఈ సర్వేను ప్రతీ ఏటా నిర్వహిస్తుంది.కాగా హిల్లరీ క్లింటన్‌కు ఈ జాబితాలో మూడవ స్థానం దక్కింది.

మెలానియా ట్రంప్ సైతం మూడవ స్థానలోనే కొనసాగుతున్నారు.

Advertisement

తాజా వార్తలు