ఆ బిజినెస్‌ వెనుక మాస్టర్‌ ప్లాన్‌... సూత్రధారి నమ్రతనే!

ఏడాదికొక సినిమా, పలు పెద్ద పెద్ద బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ ఆదాయాన్ని అంతకంతకు పెంచుకుంటూ నిజమైన శ్రీమంతుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు.ఇంకా 20ఏళ్ల దాకా ఈయన కెరియర్‌కు ఎలాంటి డోకా లేదు.

 Namrata Shirodkar Plan About Amb Cinemas-TeluguStop.com

‘శ్రీమంతుడు’ చిత్రంతో నిర్మాతగా మారిపోయిన మహేష్‌బాబు ఇటీవల థియేటర్స్‌ బిజినెస్‌లో అడుగు పెట్టాడు.సినీ ఇండస్ట్రీలో చాలా రకా బిజినెస్‌లు ఉన్నా మహేష్‌ థియేటర్‌ బిజినెస్‌నే ఎందుకు ఎంచుకున్నాడంటే అందుకు చాలా పెద్ద ప్లాన్‌ ఉన్నట్టే తెలుస్తోంది.

సినిమా తప్పా మరో వ్యాపకం లేని మహేష్‌ని ఈయన సతీమణి నమ్రత నిర్మాతని చేసింది.అంతేకాకుండా ఎక్కువ సంఖ్యలో బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించే ఆలోచన కూడా నమ్రతదే.ఇకపోతే తాజాగా మొదలు పెట్టిన థియేటర్‌ బిజినెస్‌ సలహా ఇచ్చినది కూడా నమ్రతనే.ఈ బిజినెస్‌ వెనుక ఒక మాస్టర్‌ ప్లాన్‌ వేసి ఆ దిశగా మహేష్‌ను నడిపించి, దీనికి సూత్రధారిగా వ్యవహరించింది మహేష్‌ సతీమణి నమ్రత.

మహేష్‌ బాబు ఏషియన్‌ సినిమాస్‌తో కలిసి ఏఎమ్‌బి మల్టీప్లెక్స్‌ను హైద్రాబాద్‌లో నిర్మించాడు.ఇక త్వరలో ఈ థియేటర్‌ని అన్ని జిల్లాల్లో విస్తరించనున్నాడు.

థియేటర్‌ బిజినెస్‌ మొదలు పెట్టే ముందు ఒక మాస్టర్‌ ప్లాన్‌ చేసింది నమ్రత.ఇటీవల ఎంత నటనా పటిమ ఉన్నా హీరో అయినా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే వారికి థియేటర్‌ యాజమాన్యంపై నియంత్రణ ఉండాలి.కానీ అలాంటి పరిస్థితి లేనివారు ఎంత గొప్ప చిత్రాలను తీసినా కూడా అవి పెద్దగా ఆడడం లేదు.దాంతో మహేష్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు.అంతేకాకుండా తన కొడుకు కూడా తెరంగేట్రం చేసే రోజులు రాబోతున్నాయి.దాంతో స్వంత థియేటర్స్‌ ఉంటే ఇక పెద్ద హీరోగా కొడుకు కూడా రంగంలోకి చాలా ఈజీగా దిగి సెటిల్‌ అవ్వవచ్చు.

ఇక తన కెరియర్‌కు కూడా ఇది చాలా పెద్ద ప్లస్‌ అవుతంది.అందుకే మహేష్‌ ఈ బిజినెస్‌ను ఎంచుకన్నట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube