విశాఖ ఉత్సవ్ పేరుతో ప్రభుత్వం ఈ నెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించతలపెట్టిన విశాఖ ఉత్సవ్‌ను ప్రజలు బహిష్కరించాలని మావోయిస్టు పార్టీ ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రత్యేక జోనల్ కమిటీ అధికార ప్రతినిధి జగబంధు పిలుపునిచ్చారు.మావోయిస్టు నేత జగబంధు పేరిట శనివారం రాత్రి ఓ లేఖ విడుదలైంది.
ప్రకృతి విపత్తులు, ఇతర సమస్యలతో ఉన్న ప్రజలను పట్టించుకోకుండా టూరిజం పేరిట విశాఖ ఉత్సవ్‌ను నిర్వహిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించడం, ‘రోమ్ నగరం తగలబడుతుంటే.రోమ్ చక్రవర్తి పిడేలు వాయిస్తున్నట్టు’గా ఉందని ఆయన విమర్శించారు.
రాష్ట్రం, జిల్లా తీవ్ర దుర్భిక్షంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.ఈ నేపథ్యంలో ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా ఉత్సవాలను నిర్వహించడం దారుణమన్నారు.
.






