జగన్ మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కేలా చేయడానికి చంద్రబాబు ఎనలేని కృషి చేస్తున్నారట.ఇదేంటి ఎక్కడో అచ్చు తప్పు పడిందని అనుకుంటున్నారా.?? మీరు చదివింది నిజమే జగన్ సీఎం అవడమే బాబు ధ్యేయంగా పని చేస్తున్నారు.అందుకు తగ్గట్టుగా వ్యుహాలని రచిస్తున్నారట.
ఏంటి మళ్ళీ కన్ఫ్యూజన్ లో పడ్డారా.??మీరు చదువుతున్నది.చదవబోయేది అక్షరాలా నిజమే.అది ఎలా నిజమో పూర్తిగా చూస్తె మీకే తెలుస్తుంది…వివరాలలోకి ఒక్క సారి వెళ్తే.

తెలంగాణలో జీవం చచ్చిపోయిన టీడీపీకి మళ్ళీ పునర్వైభవం తీసుకు రావడానికి కాంగ్రెస్ తో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన చంద్రబాబు ఇప్పుడు మళ్ళీ ఏపీలో సైతం కాంగ్రెస్ తో జట్టుకట్టడానికి సిద్దమయ్యారట.ఇందుకోసం వ్యుహాలని సిద్దం చేస్తున్నారట.దాంతో వైసీపీ నేతలు సబరాలు చేసుకుంటున్నారు.తెలంగాణా ప్రజలు కూటమిని బొంద పెట్టినా సరే బాబు జట్లేసుకుని ఏపీలో సైతం తిరగడానికి ప్లాన్ చేయడంతో టీడీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.
పార్టీ ప్రయోజనాలని పక్కన పెట్టిన బాబు సోత్న ప్రయోజనాల కోసం పాకులాడటం నేతలకి సైతం రుచించడం లేదు.దనతో ఈ సారి కూడా చంద్రబాబు

ఏపీలో వైసీపీ పార్టీని గెలిపించడానికి వ్యూహాలు సిద్దం చేస్తున్నారంటూ పార్టీ వర్గాలు పళ్ళు నిమురుతున్నాయి.
బాబు రచిస్తున్న వ్యూహాలు కేవలం జగన్ మోహన్ రెడ్డి ని సీఎం చేయడానికే అన్నట్టుగా ఉన్నాయని రాజకీయ పండితులు సైతం విశ్లేషిస్తున్నారు.ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ తో పోత్తునే ఒప్పుకొని టీడీపీ అభిమానులు, పార్టీ నేతలు.
ఎపీకి తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ఊరుకుంటామా అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారట.

మరి పార్టీ నేతలే అలా ఉంటే విభజన సమయంలో ఉద్యమాలలో పాల్గొన్న ప్రజలు ఎలా ఆలోచిస్తారు.మేధావులు ఇంకెలా ఆలోచిస్తారు.?? మరి అలాంటి ఆలోచన చేయకుండా కేవలం తన స్వార్ధం కోసం బాబు కాంగ్రెస్ తో అంటకాగాలని అనుకోవడం ఎంతవరకూ సమంజసం అనే ప్రశ్నలు రేగుతున్నాయి.అంతేకాదు ఏపీలో కాంగ్రెస్ తో పొత్తు ఉంటే బాబే జగన్ ని దగ్గర ఉండి మరీ సీఎం చేసినట్టే అంటున్నారు విశ్లేషకులు.







