అమెరికాలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రభుత్వానికి సంభందించిన అధికారులే శిక్షలకి గురవుతున్నారు.అంతేకాదు మాజీ అధికారులు సైతం ప్రస్తుతం విమర్సలని ఎదుర్కుంటున్నారు.
ఇదిలాఉంటే తాజాగా ట్రంప్ మాజీ సలహాదారు మైకేల్ ఫ్లిన్ ని జైలు శిక్ష పడే అవాకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

గత ఎన్నికల్లో అంటే 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై కొనసాగుతున్న దర్యాప్తులో ఎఫ్‌బిఐని తప్పుదోవ పట్టించిన ఆరోపణలపై ఫ్లిన్ కి జైలు శిక్ష అమలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.ఈ కేసును విచారిస్తున్న అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి ఎమ్మెట్ సుల్లివన్ వాషింగ్టన్‌లో ఈ తీర్పును వెలువరించనున్నారని అమెరికా న్యాయశాఖ వర్గాలు చెబుతున్నాయి.

కాని ఫ్లిన్ అమెరికాకి , సైన్యానికి చేసిన సేవలని దృష్టిలో ఉంచుకుని ఆయన్ని జైలుకు పంపవద్దని అయితే ఈ దర్యాప్తుకు నేతృత్వం వహిస్తున్న స్పెషల్ ప్రాసిక్యూటర్ రాబర్ట్ ముల్లర్ న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు.అయితే ఈ రకంగా దర్యాప్తు అధికారి ఈ విన్నపం చేయడం ఆశ్చర్యం కలిగించినా ఎటువంటి తీర్పు వెలువడుతుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అమెరికన్స్.







