బూతు చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మారుతి మెల్ల మెల్లగా ఆ ఇమేజ్‌ను దూరం చేసుకుంటూ వస్తున్నాడు.వరుసగా మంచి విజయాలను దక్కించుకున్న దర్శకుడు మారుతి తాజాగా ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రంతో మాత్రం ఫ్లాప్ అయ్యాడు.
ఏమాత్రం ఆకట్టుకోని కథ కథనంతో ఆ చిత్రాన్ని తెరకెక్కించడంతో ప్రేక్షకులు తిరష్కరించారు.భారీగా ఆ చిత్రంతో నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు అంటూ సమాచారం అందుతోంది.
ఆ సినిమా దెబ్బకు మారుతి తదుపరి చిత్రంకు చాలా సమయం తీసుకుంటున్నాడు.

మారుతి ప్రస్తుతం అల్లు అర్జున్ కోసం ఒక కథను సిద్దం చేస్తున్నాడు అంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.చాలా కాలంగా బన్నీతో మూవీ చేయాలని ఉవ్విల్లూరుతున్న మారుతి తాజాగా బన్నీకి ఒక స్టోరీ లైన్ కూడా వినిపించాడు అంటూ వార్తలు వస్తున్నాయి.అయితే మెగా ప్యాన్స్ మాత్రం ఆ వార్తలను కొట్టి పారేస్తున్నారు.
మారుతికి అంత సీన్ లేదు అంటూ కామెంట్ చేస్తున్నారు.బూతు సినిమాల దర్శకుడు మారుతి బన్నీతో సినిమా చేసే స్థాయికి ఇంకా ఎదగలేదు అంటూ విమర్శలు చేస్తున్నారు.
మరో మూడు నాుగు మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను తీసి, సక్సెస్ దక్కించుకుంటే అప్పుడు బన్నీ మారుతికి ఛాన్స్ ఇవ్వాలని మెగా ఫ్యాన్స్ కోరుతున్నారు.

ప్రస్తుతం బన్నీ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.మరి కొన్ని రోజుల్లో ఆ సినిమా పట్టాలెక్కబోతుంది.త్వరలోనే మరో సినిమా కూడా బన్నీ చేయబోతున్నాడు.
ఆ సినిమాకు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తాడు.ఆ తర్వాత లింగు స్వామి దర్శకత్వంలో కూడా నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇలా వరుసగా పెద్ద దర్శకుతో బన్నీ కమిట్ అయ్యి ఉన్నందున మరో హీరోను మారుతి చూసుకుంటే బెటర్ అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







