అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ గా..??

అమెరికాలో అత్యతంత కీలకమైన పదవికి డెమోక్రాట్లు ఆ పార్టీ మైనారిటీ నేత అయిన నాన్సీ పెలోసీని ఎంపిక చేశారు.

డెమోక్రాట్లు అందరూ సమావేశం ఏర్పాటు చేసుకుని సుమారు 203-32 ఓట్లతో పెలోసి అభ్యర్థిత్వానికి ఆమోదం తెలిపారు.

అయితే స్పీకర్ ఎంపిక సమావేశానికి మీడియాను అనుమతించక పోవడం గమనార్హం.

ఇదిలాఉంటే స్పీకర్‌గా నామినేట్‌ కావడంలో పెలోసీ ఎలాంటి వ్యతిరేకతను ఎదుర్కొన లేకపోయినా సరే ఆమెకు సొంత పార్టీలోని కొంతమంది సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేక రావడం లో ఆమె స్పీకర్ గా ఆ స్థానంలో కూర్చునే వరకూ తిప్పలు ఉంటాయని అంటున్నారు.నాన్సీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ అధికారికంగా సుమారు 16 మంది సభ్యులు ఒక లేఖని సైతం రాశారు.అయితే వారిలో కొంతమంది తరువాత నాన్సీకి మద్దతు తెలిపినా పూర్తీ స్థాయి ఎంపిక జరిగేవరకూ కూడా ఆమెకి టెన్షన్ తప్పదని తెలుస్తోంది.

స్పీకర్ గా ఆమె గెలుపొండాలి అంటే ఆమెకి దాదాపు 218 ఓట్లు పడాల్సిందే.

Advertisement
బెడ్‌రూమ్‌లో రాక్షసి ఉందనుకున్న చిన్నారి.. తీరా వెతికితే ఊహించని షాక్..?
Advertisement

తాజా వార్తలు