శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు కొనసాగుతున్నాయి.తాజాగా ఫేస్‌బుక్‌లో మరోసారి ఒక తమిళ స్టార్ హీరో గురించి సంచలన వ్యాఖ్యలు చేసి తమిళ సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యింది.
ఇప్పటికే తెలుగు సినిమా తారలను భయపెట్టిన శ్రీరెడ్డి ఇప్పుడు తమిళ స్టార్ హీరోపై వరుసగా కామెంట్స్ చేస్తూ ఆయన సన్నిహితులకు ఆవేదన కలిగిస్తుందని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.తాజాగా ఫేస్‌బుక్‌లో ఆమె పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అయ్యింది.

శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో.నన్ను ఒక పబ్లిక్ టాయిలెట్ కంటే దారుణంగా వాడుకున్నారు.ఇప్పటికి, ఎప్పటికి ఆ గాయాలు మానవు, మానలేదు.నా గాయాలు మానకుండానే నన్ను మళ్లీ టార్గెట్ చేస్తున్నారు.నేను నిజాలు మాట్లాడినందుకు వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేయడం జరిగిందని శ్రీరెడ్డి పేర్కొంది.ఆ హీరో ఎంత స్త్రీ లోలుడో అనే విషయాన్ని నేను మీడియా ముందుకు తీసుకు వచ్చినందుకు తనకు ఈ శిక్ష అంటూ శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది.
ప్రస్తుతం నేను తమిళ సినిమాల్లో నటిస్తున్నాను.కొన్నాళ్లు ఇలాంటి పరిస్థితి ఉంటే నా శవం సినిమాల్లో నటించాల్సి వస్తుందేమో అనే ఆవేదన మరియు భయం వ్యక్తం అవుతుందన పేర్కొంది.

నన్ను టార్గెట్ చేసిన తమిళ హీరో తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరో అంటూ పేర్కొంది.గతంలోనే ఆ హీరోపై సంచలన వ్యాఖ్యలు చేసింది.నడిగర్ సంఘం, నిర్మాతల మండలిలో కీలక పదవులు చేపట్టిన ఆ హీరో ఇంకా ఎంత మంది జీవితాలను నాశనం చేయాలని చూస్తున్నాడు అంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసి ఆ హీరో పరువు తీసింది.నన్ను చంపేయాలని చూస్తున్నారంటూ ఆ హీరో గురించి కామెంట్ చేస్తోంది.
ఇంతకు ఆ హీరో ఎవరో మీకు ఇప్పటికే అర్థం అయ్యి ఉంటుంది కదా.!
.






