నెగ్గిన పంతం...వైట్ హౌస్ అధికారిణి తొలగింపు..

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సతీమణి ఎట్టకేలకి తన పంతం నెగ్గించుకుంది.ఒకరిపై కక్ష తీర్చుకోవడంలో తానూ తన భర్త ట్రంప్ కి ఏ మాత్రం తీసిపోనని నిరూపించింది.

 Deputy National Security Adviser Mira Ricardel Forced Out Of White House-TeluguStop.com

అందుకే తన ఒత్తిడితో వైట్‌హౌస్‌ డిప్యూటీ నేషనల్‌ సెక్యురిటీ అడ్వైజర్‌ మీరా రికార్డెల్‌ను ఎట్టకేలకు పదవి నుంచీ తప్పించింది.మెలానియా ఒత్తిడితో ఆమెని తొలగించారని అంటున్నారు.

మీరా రికార్డెల్‌ ట్రంప్‌ కోసం పనిచేయడానికి కాదు అని.అయినా ఆమె ఎక్కువ కాలం శ్వేతసౌధంలో పనిచేయలేరని ఫస్ట్‌లేడీ అధికార ప్రతినిధి వెల్లడించారు.ఇది జరిగిన మరుసటి రోజునే రికార్డెల్‌ను పదవి నుంచి తొలగిస్తూ ఉత్తరువులు ఇచ్చారు.అయితే రికార్డెల్‌ అధ్యక్షుడికి మద్దతు కొనసాగిస్తారని.ఆమె యంత్రాంగంలో నూతన బాధ్యతలు తీసుకునేందుకు ఇక్కడి నుంచి వెళ్తున్నా రని వైట్‌హౌస్‌ అధికార ప్రతినిధి సారా శాండర్స్‌ వెల్లడించారు.

ఇదిలాఉంటే రికార్డెల్‌ కొత్తగా చేపట్టబోయే భాద్యతల విషయంలో మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు.రికార్డెల్‌ గతంలో వాణిజ్య విభాగంలో పని చేసిన అనుభవం ఉంది.అయితే ఇప్పుడు ఆమె స్థానంలో ట్రంప్‌ జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌ ఆమెను తన డిప్యూటీగా ట్రంప్ నియమించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube