‘2.ఓ’ స్టోరీ లైన్‌ మరీ ఇంత సిల్లీగా ఉంటుందా.. శంకర్‌ మరీ ఇంత చిల్లరగా ఆలోచించడేమో!

తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ హీరోగా, బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ విలన్‌ గా సౌత్‌ దిగ్గజ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన అద్బుతమైన విజువల్‌ వండర్‌ మూవీ ‘2.ఓ’.

 The 2 0 Movie Un Known Facts-TeluguStop.com

ఈ చిత్రం మరికొన్ని రోజుల్లో విడుదలకు సిద్దం అవుతుంది.దాదాపు 550 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం కోసం తమిళ ఆడియన్స్‌ మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్స్‌ ఎదురు చూస్తున్నారు.

బాలీవుడ్‌లో ఈ సినిమా దుమ్ము రేపడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.ఇలాంటి సినిమా కథ విషయంలో పు చర్చలు, పుకార్లు జరుగుతున్నాయి.

సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం.ఈ చిత్రం కథ అక్షయ్‌ కుమార్‌ చనిపోవడంతో మొదలవుతుందట.అతడు స్మార్ట్‌ ఫోన్‌ యూజర్ల వల్ల చనిపోతాడట.

అది ఎలా అనేది తెలియదు, కాని స్మార్ట్‌ ఫోన్‌ యూజర్ల వల్ల చనిపోయిన అతడు రాక్షసుడిగా మారిపోతాడు.అలా మారిపోయి అందరి వద్ద నుండి మొబైల్స్‌ లాగేసుకుంటాడు.

అలాంటి సమయంలో వసీకర్‌ మరోసారి చిట్టి రోబోను ఆవిష్కరిస్తాడు.ఈసారి చిట్టి 2.ఓగా వస్తుంది.రోబోతో ఆ దుష్టశక్తిని అంతం చేస్తారట.

కథ మరీ సిల్లీగా అనిపిస్తుంది కదా, అయితే ఈ కథలో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.చనిపోయిన వ్యక్తి ఆత్మగా మారుతుంది.కాని దుష్టశక్తిగా మారడం, అది అందరికి కనిపించడం, అందరి ఫోన్‌లు లాగేసుకోవడం విచిత్రంగా ఉంది.

మొదట అక్షయ్‌ మొబైల్స్‌ వల్ల చనిపోవడమే చాలా చెత్తగా అనిపిస్తుంది.ఇదే అసలు కథ అయితే శంకర్‌ తనదైన శైలిలో విభిన్నంగా చూపిస్తాడని ఆశిద్దాం.

లేదంటే మరేదైనా కథ ఈ చిత్రంలో ఉంటుందో చూడాలి.మొత్తానికి శంకర్‌ తెరకెక్కించిన ఈ చిత్రం ఇండియన్స్‌ గర్వపడేలా ఉంటుందనేది అందరు అంటున్న మాట.హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వేల కోట్ల వసూళ్లు సాధిస్తుందనే నమ్మకం అందరిలో వ్యక్తం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube