తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ అందుకు తగ్గట్టుగా పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటోంది.అందులో భాగంగా.
కొన్ని సీట్లను కూడా త్యాగం చేసి మహా కూటమి ఏర్పాటు చేసి అందులో చేరిన పార్టీలకు పంచేందుకు సిద్ధమైంది ఈ నేపథ్యంలో తెలంగాణలో పార్టీ అభ్యర్థుల బలా బలాలపై కాంగ్రెస్ అధిష్ఠానం ఓ సర్వ్ నిర్వహించింది.పనిలో పనిగా తేదీకి కేటాయించ సీట్లలో కూడా సర్వే పూర్తి చేయించగా ఆసక్తికర ఫలితాలు వచ్చాయట.
ఇక కూటమిలో మొత్తం అన్ని పార్టీలకు సీట్ల సర్దుబాటు పూర్తయిన తరువాత మరోసారి సర్వే చేయించి ఆ ఫలితాలకు అనుగుణంగా మార్పు చేర్పులు చేయించేందుకు కాంగ్రెస్ సిద్ధం అవుతోంది.

ప్రస్తుతం కాంగ్రెస్ చేయించిన సర్వేలో దాదాపు 35 నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు ఉన్నట్టు తేలిందట.ఈ స్థానాల్లో కాంగ్రెస్, టీడీపీ నుంచి ఎవరు పోటీ చేసినా గెలుస్తారని సర్వేలో వెల్లడైనట్లు సమాచారం.35 నియోజకవర్గాల్లో ఎక్కువగా టీడీపీ బలంగా ఉందని సర్వేలో తేలినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన వారు పార్టీ మారినప్పటికీ.ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ బలంగా ఉనట్లు సమాచారం.అదేవిధంగా పలు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్‌పై తీవ్ర వ్యతిరేకత ఉందని నివేదికలో వెల్లడైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.దీనిలో భాగంగానే… సర్వే నివేదిక, మహాకూటమి పొత్తులు, తాజా పరిస్థితిపై చర్చించేందుకు టీ.పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ను ఢిల్లీకి రావాల్సిందిగా పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఆదేశించారు.ఈ నేపథ్యంలో ఉత్తమ్ ఢిల్లీకి వెళ్లారు.
సర్వేలో తేలిన 35 సీట్లలో గెలుపు ఖాయం కాబట్టి.మిగతా స్థానాలపై పూర్తిస్థాయిలో దృష్టిపెడితే తెలంగాణాలో అధికారం దక్కడం ఖాయం అనే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది.కాంగ్రెస్ సర్వే చేయించిన నియోజకవర్గాల్లో అనుకూల ఫలితాలు వచ్చిన నియోజకవర్గాలు ఈ విధంగా ఉన్నాయి.

దేవరకద్ర, మక్తల్, వనపర్తి, జడ్చర్ల, షాద్‌నగర్, పటాన్‌చెరు, జహీరాబాద్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, సిర్పూర్, ఖానాపూర్, జగిత్యాల, పెద్దపల్లి, నర్సంపేట్, ములుగు, వరంగల్ తూర్పు, భూపాలపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, తుంగతుర్తి, ఆలేరు, ఉప్పల్, ఎల్‌బీ నగర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, ముషీరాబాద్, సనత్‌నగర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్.







