రామ్ గోపాల్ వర్మ ‘ఆఫీసర్’ చిత్రం తర్వాత మరో సినిమాను ఇంకా మొదలు పెట్టలేదు.ఈయన నిర్మాణంలో ‘భైరవ గీత’ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది.
మరో వైపు వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.ప్రస్తుతం సినిమా కోసం నటీనటుల ఎంపిక చేస్తున్నాడు.
మరో వైపు స్క్రిప్ట్‌ను కూడా సిద్దం చేస్తున్నాడు.స్క్రిప్ట్ వర్క్‌లో పలువురు రచయితలను మరియు ఎన్టీఆర్ శిష్యులను భాగస్వామ్యం చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.

తన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలో ఎన్టీఆర్, లక్ష్మి పార్వతిల వివాహం, ఆ తర్వాత చంద్రబాబు అధికారంను లాక్కోవడం ఇంకా ఇతరత్ర కీలకమైన విషయాలను చూపించబోతున్నాడట.ఇప్పటి వరకు ఎన్టీఆర్ గురించి తెలియని ఎన్నో విషయాలను ఈ చిత్రం ద్వారా బయటకు వస్తాయంటూ ఆయన హామీ ఇస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రంలో చంద్రబాబు నాయుడు పాత్ర కోసం ఒక వ్యక్తిని పట్టిన వర్మ ప్రస్తుతం ఎన్టీఆర్ కోసం వెదుకుతున్నాడు.
ఒక వీడియోలో చూసి అచ్చు చంద్రబాబు నాయుడులా ఉన్నాడే, ఈ వ్యక్తి తన సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్రను ఈయనతో నే చేయిస్తాను అంటూ భీష్మించుకుని, లక్ష రూపాయల ప్రైజ్ మనీ ప్రకటించి మరీ అతడిని తీసుకు రావడం జరిగింది.
ఇప్పుడు ఎన్టీఆర్ పాత్ర కోసం ఒక మంచి వ్యక్తిని, అచ్చు ఎన్టీఆర్‌లా ఉన్న వ్యక్తిని తీసుకు వస్తే 10 లక్షల బహుమానం ఇస్తానంటూ వర్మ ప్రకటించాడు.

చంద్రబాబు లభించినంత సులభంగా ఎన్టీఆర్ లభించడని, ఎన్టీఆర్‌ను మైమరపించేలా ఏ వ్యక్తి ఉండడు అంటూ నందమూరి ఫ్యాన్స్ అంటున్నారు.తెలుగు సినీ జగత్తును, తెలుగు ప్రజలను ఏళిన ఎన్టీఆర్ కు డూప్ ఎవరైనా దొరుకుతారేమో చూడాలి.







