పవన్- జగన్ అంతా ఓ 'రహస్యం' !

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి పెరగడంతో అధికార పార్టీలను ఓడించేందుకు విపక్ష పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయి.ముందు అధికార పార్టీని గద్దె దించితే.

 Ys Jagan And Pawan Kalyan Secret Tasks For Defeat The Tdp-TeluguStop.com

ఆ తరువాత అధికారాన్ని ఒప్పందం ప్రకారం పంచుకోవచ్చు అనే కోణంలో విపక్ష పార్టీలు ఒక అంగీకారానికి వస్తున్నాయి.తెలంగాణాలో ప్రజకూటమి ( మహాకూటమి) చూసుకున్నా … ఏపీలో జనసేన- వైసీపీ లను పరిగణలోకి తీసుకున్నా ఈ విషయం అర్ధం అవుతుంది.

అయితే ఈ పార్టీల మధ్య మొదట్లో సీట్ల పంపకం దగ్గర తేడా వచ్చి రెండు పార్టీ ల పొత్తు అంశం మధ్యలో ఆగిపోయింది.కానీ ఇప్పుడు అసలు లెక్క వేరే ఉందట.

తాజాగాగా ఏపీలో టీడీపీని ఓడించడమే లక్ష్యంగా ఒకవైపు వైసీపీ , మరోవైపు జనసేన విడివిడిగా పోరాడుతున్నాయి.అయితే బలమైన టీడీపీని గద్దె దించాలంటే విడివిడిగా పోరాడితే కష్టమని , పొత్తు పెట్టుకోవాల్సిందే అనే లెక్కల్లోకి వైసీపీ- జనసేన పార్టీలు వచ్చాయి.గత కొంతకాలంగా ఈ రెండు పార్టీల మధ్య ఈ విషయమై చర్చలు నడుస్తున్నాయి.నిన్న మొన్నటి దాకా పవన్‌తో పొత్తు పెట్టుకోవడానికి ఆసక్తి చూపని జగన్‌ ఢిల్లీ ఆదేశాల మేరకు పవన్‌’తో పొత్తుకు సిద్ధం అవుతున్నారట.

విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు శుక్రవారం నాడు హైదరాబాద్‌లో పవన్‌- జగన్‌లు ముఖాముఖి చర్చలు జరిపారని, ఈ చర్చల్లో.పొత్తు అంశం బయటకు వచ్చిందని తెలుస్తోంది.

దసరా సమయానికి ఈ రెండు పార్టీల మధ్య పొత్తు విషయం ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

టీడీపీని ఓడించేందుకు జగన్‌తోనైనా వెళతానన్న పవన్‌ ఇదే విషయంపై జగన్‌తో చర్చించారని తెలుస్తోంది.‘చంద్రబాబు’ ఇప్పటికీ బలంగా ఉన్నాడని…ఇద్దరం కలిస్తేనే బాబును ఓడించగలమనే అభిప్రాయాన్ని పవన్‌ వ్యక్తం చేశారట.దీనిపై జగన్‌ పెద్దగా స్పందించలేదని తెలిసింది.చంద్రబాబును ఓడించాలన్న బిజెపి పెద్దల ఆదేశంతోనే…జగన్‌ పవన్‌తో కూర్చోడానికి ఇష్టపడ్డారని.లేకుంటే…ఆయనతో జగన్‌ చర్చలు జరపరని ఆ పార్టీకి చెందిన నాయకులు చెబుతున్నారు.కాగా.చర్చల్లో సీట్ల అంశం చర్చకు రాలేదని, ఏ విధంగా చంద్రబాబును ఓడించాలనే దానిపైనే ఎక్కువ చర్చ జరిగిందని, అదే సమయంలో వైకాపా,పవన్‌,బిజెపిలు కుమ్ముక్కు అయ్యాయనే విషయం ప్రజల దృష్టికి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించారని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube