మహాకూటమి సీఎం అభ్యర్థిగా రేవంత్ ..? ఏకాభిప్రాయం కుదిరిందా ..?

తెలంగాణాలో తనకు అడ్డు అదుపు లేదు అనుకుంటూ ముందుకు వెళ్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కు సరైన రాజకీయ ప్రత్యర్థి ఏవైరాన ఉన్నారా అంటే… అది రేవంత్ ఒక్కడే అని కేసీఆర్ ఆందోళన చెందుతుంటాడు.అందుకే రేవంత్ ని కేసుల్లో ఇరికించి అడ్డు తొలగించుకోవాలని కేసీఆర్ ఆయన్ను అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నా దాన్ని తన రాజకీయ ఎదుగుదలకు ఉపయోగించుకుని రోజు రోజుకి రేవంత్ బలపడుతున్నాడు.

 Revanth Reddy Is The Cm Candidate In Mahakutami-TeluguStop.com

కాంగ్రెస్ లో సీఎం అవుదామని ప్రయత్నిస్తున్న వారు.ఆ స్థాయి కలిగిన వ్యక్తులు చాలా మంది ఉన్నా … కేసీఆర్ ని ఢీ కొట్టడం లో వారంతా విఫలం అవుతున్నారు.

ఈ దశలో మహాకూటమి తరపున చూసుకున్నా …విడిగా కాంగ్రెస్ పార్టీ తరపున చూసుకున్నా రేవంత్ రెడ్డి ఒక్కడే ప్రత్యామ్న్యాయంగా కనిపిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో మహా కూటమి తరపున రేవంత్ రెడ్డిని సీఎం గా ప్రకటిస్తే బాగుంటుంది అనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది.కాంగ్రెస్ లో లీడర్లు ఎక్కువ.పదవులు కోసం ఒకరికొకరు పోటీపడుతుంటారు.

కానీ ఏ ఒక్క నేత కూడా మిగిలిన వారిని ఒక తాటి మీదకి తీసుకు రాలేరు.అయితే ఒక రేవంత్ రెడ్డి కె నాయకులందరినీ ఒక తాటిమీదకి తెచ్చే సామర్థ్యం ఉందని, కెసిఆర్ ను కూడా ధీటుగా ఎదుర్కునే నాయకుడు ఆయనేనని స్పష్టం అవుతోంది.

లాజిక్ గా మాట్లాడుతూ … ప్రత్యర్థులను ఇరుకున పెట్టడం లో రేవంత్ బాగా ఆరితేరి ఉన్నాడు.

ఇక తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్ లో బలమైన నాయకుడి గా ఉన్న, రేవంత్ పేరు వస్తే చాలు ఇటు ఆయన అభిమానులు అటు ఓటర్లు ఉత్సాహంతో ముందుకు వస్తారు.అందుకే కాంగ్రెస్ ఈ ప్లాన్ వేస్తోంది.2019 ఎలక్షన్స్ లో రేవంత్ రెడ్డి ని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని అధిష్టానం కూడా బలంగా నమ్ముతోంది.టీడీపీ, కాంగ్రెస్ తదితర పార్టీలన్నీ కలిసి మహాకూటమిగా పోటీచేస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థి అయితే ఇక తిరుగే ఉండదన్నట్టుగా కూటమిలోని పార్టీలు అభిప్రాయపడుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube