పవన్ పై హత్య కి కుట్ర..ఇందులో నిజమెంత..?

పవన్ కళ్యాణ్ పశ్చిమ పర్యటన ఎంతో సంచలనం సృష్టిస్తోంది.

ఎన్నడూ లేని విధంగా పవన కళ్యాణ్ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఆకు రౌడీ, చిల్లర రౌడీ అంటూ సదరు ఎమ్మెల్యే పరువు అడ్డంగా తీసేస్తున్నారు.

ఇదిలాఉంటే మరో పక్క చింతమనేని ప్రభాకర్ కూడా పవన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ పవన్ కళ్యాణ్ పశ్చిమ టూర్ కి ఫుల్ క్రేజ్ తెప్పించేశారు.చింతమనేని అక్రమాలపై దెందులూరు లో జనసేన తరుపున తన వాణి వినిపించిన పవన కళ్యాణ్ అదే ఊపుని ఏలూరు లో కూడా కొనసాగించారు అయితే

ఈ క్రమంలో పవన కళ్యాణ్ చింతమనేని పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే.ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి పై కూడా ఫైర్ అయ్యారు మీరు చంద్రబాబులా దెందులూరు ఎమ్మెల్యే కి భయపడుతున్నారా.చెప్పండి అతని అరాచకాలు ఏలూరు వరకూ వస్తున్నాయి అంటే మీరు భాగస్వాములా అంటూ ఫైర్ అయ్యారు అంతటితో ఆగకుండా పవన్ మరొక సంచలన వ్యాఖ్యలని చేశారు.

నాపై హత్యా యత్నం కి ఒక భారీ కుట్ర జరుగుతోంది అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు దాంతో అక్కడకి వాతావరణం మొత్తం అభిమానుల అరుపులతో మారుమోగి పోయింది.అయితే పవన్ దాంతో పాటు మరి కొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు.

Advertisement

నన్ను చంపాలని అనుకుంటున్నారు “ముగ్గురు క్రిమినల్స్” అందుకు వ్యుహాలని రచిస్తున్నారు.నన్ను చంపితే ఏపీలో తమకి అడ్డు ఉండదని వ్యుహాలని సిద్దం చేస్తున్నారు.

ఈ క్రమంలో వారు మాట్లాడిన మాటల తాలూకూ క్లిప్ లు నాదగ్గర ఉన్నాయి.వాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు వారు పేర్లు కూడా నాకు తెలుసు.

వారి ముఖాలు కూడా నాకు తెలుసు అంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.నన్ను చంపేసి అధికార, ప్రతిపక్షాలు ఒకరిమీద ఒకరు తోసుకుని అడ్డు తొలగించుకోవాలని.

ఆ విధంగా నన్ను భయపెట్టాలని చూస్తున్నారని ఇలాంటి చిల్లర రాజకీయాలు నావద్ద సాగవని పవన్ హెచ్చరించారు.అయితే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసిన రోజు రాత్రి పవన్ బస చేస్తున్న క్రాంతి మండపం పరిసర ప్రాంతాలలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తిరగడంతో వారిని పవన్ అభిమానులు వెంబడించారు

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

అంతేకాదు వారు వచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్ బండిని వదిలేసి పారిపోగా ఆ బండిని స్వాధీన పరుచుకున్నారు పోలీసుకు ఆ బండి వెనుకాల చింతమనేని ఫోటో ఉండటం గమనార్హం.అయితే ఈ విషయంలో అభిమానులు శాంతంగా ఉండాలని పవన్ సూచనలు చేశారు.అయితే ఇంతకీ పవన్ చెప్పిన ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు పవన్ కి ఈ విషయాలు ఎలా తెలిసాయి అనేది తెలియరాలేదు.

Advertisement

తాజా వార్తలు