మోడరేట్ గా మందు తాగితే లాభాలే ఉన్నాయి అని డాక్టర్లు చెబుతున్నారు కాని, అలా లేక్కలేసుకొని తాగడం మధ్యతరగతి ప్రజల నుంచి జరగని పని.ధనువంతులైతే ఫిట్ నెస్ ట్రాకర్స్ మెయింటేన్ చేస్తారు, ఇంట్లో ఎప్పుడు మద్యం మెయింటేన్ చేస్తారు.
రోజుకో గ్లాసు అంటూ లేక్కలేసుకొని తాగడం, ఆ తరువాత డైట్ మెయింటేన్ చేయడం వారికి ఈజీ.కాని మధ్య తరగతి వారు, పేదవారు అలా కాదు కదా.బాటిల్ దొరికితే బాటిల్ ఖాళి అవాల్సిందే.వారానికి రెండు సార్లు మాస్ గా తాగెస్తారు.
దాంతో లివర్ లో టాక్సిన్స్ జమ అవుతాయి.రోజురోజుకి లివర్ ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది.
అలాంటివారు తక్కువ బడ్జెట్ లో వచ్చే ఈ ఆహార పదార్థాల ఆసరా తీసుకోవాలి.
* గ్రీన్ టీ లో తన్నిన్స్, కటేచిన్స్ అనే యాంటిఆక్సిడెంట్స్ ఉంటాయి.
ఇవి లివర్ ఆరోగ్యానికి మంచివి.లివర్ ని ప్రమాదంలోకి నెట్టే ఫైబ్రోసిస్, సిర్రోసిస్, హేపతెతిస్ లాంటి జబ్బుల నుంచి కాపాడగలవు ఈ యాంటిఆక్సిడెంట్స్.
కాబట్టి మద్యం అలవాటు ఎక్కువ ఉన్నవారు, టీ, కాఫీ, మానేసి గ్రీన్ టీని పట్టుకోవడం బెటర్.నిజానికి మద్యం తాగడం మానేస్తేనే మంచిది కాని, ఒకవేళ ఆ వ్యసనాన్ని ఒక్కసారిగా దూరం పెట్టలేకపోతే గ్రీన్ టి అలవాటు ఖచ్చితంగా ఉండాలి.
* ఆపిల్ లో పెక్టిన్ అనే కెమికల్ ఉంటుంది.ఇది శరీరాన్ని శుభ్రం చేయడానికి చాలా ఉపయోగపడుతుంది.
అందుకే డిటాక్సీఫికేషన్ లో ఆపిల్ ని బాగా వాడతారు.ఇది మలీనాల్ని తొలగించడంతో పాటు, మద్యపానం వలన కడుపులో, జీర్ణాశయంలో కలిగే మంటను చల్లారుస్తుంది.
అంతే కాదు, లివర్ నుంచి ఎప్పటికప్పుడు టాక్సిన్స్ తొలగించడానికి పనికివస్తుంది.
* అల్లంలో లివర్ కి కావాల్సిన ఎంజిమ్స్ బాగా ఉండటం మన అదృష్టం.
దీంట్లో డిటాక్సీఫికేషన్ కి కావాల్సిన అల్లిసిన్, సేలేనియం కూడా ఉండటం అదనపు లాభం.కాబట్టి మద్యం అతిగా సేవించేవారు, తమ లివర్ మీద బెంగ పెట్టుకునేవారు అల్లం తినాలి.
డైరెక్ట్ గా తినలేకపోతే, ద్రవ పదార్ధంలా తీసుకోవాలి లేదా, ద్రవ పదార్ధంలో తీసుకోవాలి.
* విటమిన్ సి కూడా లివర్ ని క్లీన్ చేయగలదు.
మరి విటమిన్ సి అనగానే మనకి సిట్రస్ జాతి ఫలాలు, అందులోనూ ఆరెంజ్, నిమ్మ గుర్తుకువస్తాయి.ఇందులో యాంటిఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ ఉండటంతో, ఈ సిట్రస్ జాతి ఫలాలు మద్యం బానిసల ఆరోగ్యాన్ని సాధ్యమైనంతవరకు కాపాడతాయి.
అందుకే, పొద్దున్నే నిమ్మరసం లేదా ఆరెంజ్ జ్యూస్స్ తాగమనేది.
* ఆపిల్ సీడెడ్ వెనిగర్ కి న్యాచురల్ క్లీన్సేనర్ అని పేరు ఉందిగా.
ఇది కూడా ఒంట్లో టాక్సిన్స్ ని తొలగిస్తుంది.మద్యం అతిగా సేవించేవారు దీన్ని ఎంత కష్టం మీదైనా తాగాలి.
ఇది కూడా మద్యం లానే విచిత్రమైన రుచితో ఉంటుంది.కాబట్టి మంచినీళ్ళలో కలుపుకొని తాగితే సరి.
* క్యారట్స్, టమాట, పాలకూర, బీట్ రూట్ .ఇవి కూడా డిటాక్సీఫికేషన్ కి పనికొచ్చేవే .చాల చవగ్గా దొరికేవి కూడా.ఇక మీ లివర్ మీ చేతుల్లో ఉంది.