ఖైరతాబాద్ గణేష్ నిమర్జనానికి గత 13ఏళ్లుగా రథసారధులు వీరే.! ఆ క్షణంలో శిల్పి ఉండరు..!

వినాయకచవితి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటాం.ఎందుకంటే పండుగ అన్నింట్లోకెళ్లా వినాయకచవితి పండుగ కోలాహలమే వేరు.

విలేజ్ లలో అయితే ఊరిప్రజలందర్ని ఏకంచేసి జరుపుకునేలా చేస్తుంది.ఇక ఎవరి ఇళ్లల్లో వారుంటూ బిజీ బతుకులు బతికే పట్న ప్రజలను ఒక దగ్గరచేసి పండుగ జరుపుకునేలా చేస్తుంది.

బాల గంగాధర తిలక్ ప్రజల్లో జాగృతి నింపి పోరాట బాట పట్టించుటకు, ఐక్యతకు వినాయకుని జయంతిని సమైక్యంగా నిర్వహించడం ప్రారంభించారు.ఆ స్పూర్తితో ప్రారంభయిందే ఖైరతాబాద్ గణేశ్…1954లో అప్పటి కౌన్సిలర్‌ సింగరి శంకరయ్య ఆధ్వర్యంలో ఒక అడుగు ఎత్తు విగ్రహంతో మొదలుపెట్టిన ఉత్సవాల ప్రతిష్ఠతో ప్రతిమ కూడా పెరుగుతూ వచ్చింది.

అలా 60ఏళ్ల వరకు ఒక్కో అడుగు పెంచుతూ ఆ తర్వాత ఒక్కో అడుగు తగ్గిస్తూ వస్తున్నారు.ప్రస్తుతం మనం 50 అడుగుల విగ్రహాన్ని చూస్తున్నాం.

Advertisement

చివరికి చేసే ఒక్క అడుగు విగ్రహం మేలిమి పసుపుతో చేస్తారట…ఎంతో ఇంట్రస్టింగ్ గా ఉంది కదా.

ఇప్పుడు అసలు కథ ఏంటి అంటే.? మన గజాననుడు నిమర్జనానికి సిద్దమయ్యాడు.తొమ్మిది రోజులు మన మధ్య సేవలందుకొని తల్లి చెంతకు పయనమవ్వనున్నాడు.

దివారం ఉదయం 7గంటలకు శోభాయాత్ర ప్రారంభమై.మధ్యాహ్నానికి ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రేన్‌ నెంబర్‌.6కు చేరుకునేలా అధికారులుఏర్పాట్లు చేస్తున్నారు.ఈ సందర్బంగా ఈ వినాయకుడిని సాగర తీరానికి పంపించే వారెవరో తెలుసుకుందామా.? మహాగణపతిని నిమజ్జనానికి తరలించే ట్రాయిలర్‌ వాహనం సారథిగా ఎస్‌టీసీ కంపెనీలో 20ఏళ్లుగా పనిచేస్తున్న భాస్కర్‌రెడ్డి బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.నాగర్‌కర్నూల్‌కు చెందిన భాస్కర్‌రెడ్డి ఆరేళ్లుగా ఖైరతాబాద్‌ నిమజ్జనానిని రథసారథిగా వ్యవహరిస్తున్నాడు.

రవి క్రేన్స్‌ ఆధ్వర్యంలో ప్రతిఏటా మహాగణపతిని ట్రాయిలర్‌ వాహనంలోకి ఎక్కిస్తున్నారు.తర్వాత తిరిగి అందులో నుంచి తీసి నిమజ్జనం చేస్తున్నారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఈ క్రేన్‌ ఆపరేటర్‌గా మహ్మద్‌ జమీల్‌ పనిచేస్తున్నాడు.

Advertisement

మహాగణపతి నిమజ్జనంలో భాగంగా గత 13ఏళ్లుగా రవిక్రేన్స్‌కు చెందిన హైడ్రాలిక్‌ టెలిస్కోప్‌ హెవీ మొబైల్‌ క్రేన్‌ను వినియోగిస్తున్నారు.జర్మనీకి చెందిన ఈ క్రేన్‌ బరువు 110 టన్నులు.150 టన్నుల బరువును అవలీలగా పైకి లేపుతుంది.క్రేన్‌ జాక్‌ 50 మీటర్ల పైకి వెళ్తుంది.

వెడల్పు 11 ఫీట్లు, పొడవు 60 ఫీట్లు ఉంటుంది.దీనికి 12 టైర్లు ఉంటాయి.

ఒక్కో టైరు ఒక టన్ను బరువు 2 మీటర్ల ఎత్తు ఉంటుంది.దీనికి 4 హైడ్రాలిక్‌ జాక్‌లు ఉంటాయి.40 టన్నుల బరువున్న ఖైరతాబాద్‌ వినాయకుడిని క్రేన్‌ అవలీలగా వాహనంలోకి ఎక్కిస్తుందని ఎండీ కేవీ రావు తెలిపారు.శోభాయాత్ర ముందు నడుస్తూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన నాగరాజు డ్రైవర్‌కు దిశానిర్దేశం చేస్తాడు.

ఇతని సూచనల మేరకు వాహనం ముందుకు సాగుతుంది.గత 15ఏళ్లుగా నాగరాజు సేవలందిస్తున్నాడు.35 ఏళ్లుగా ఖైరతాబాద్‌ మహాగణపతిని అద్భుతంగా తయారు చేస్తున్న శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్‌ నిమజ్జన యాత్రలో పాలుపంచుకోరు.తాను తీర్చిదిద్దన అద్భుత రూపం సాగరంలో కరిగిపోయే ఆ క్షణాలను చూసి తట్టుకునే ధైర్యం లేకే నిమజ్జనానికి ఉండనని చెప్పారు రాజేంద్రన్‌.

తాజా వార్తలు