నాగచైతన్య, సమంతలు వార్‌కు ఇష్టపూర్తిగా ఓకే చెప్పారు

నాగచైతన్య, అను ఎమాన్యూల్‌ జంటగా తెరకెక్కిన ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రం విడుద విషయంలో ముందు నుండి భయపడుతున్న విధంగానే జరిగింది.ఈనెల 31న విడుదల కావాల్సిన ఈ చిత్రం రీ రికార్డింగ్‌ వర్క్‌ పూర్తి కానందున వాయిదా వేస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించిన విషయం తెల్సిందే.

 Chaitu And Samantha War Will Be Soon Says Industry-TeluguStop.com

తాజాగా ఈ చిత్రంకు సంబంధించిన విడుదల తేదీపై చిత్ర యూనిట్‌ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.వినాయక చవితి శుభాకాంక్షలతో ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 13న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు.

సెప్టెంబర్‌ 13న ‘యూటర్న్‌’ విడుదల చేయాలని రెండు నెలల క్రితమే నిర్మాతలు నిర్ణయించుకున్నారు.కన్నడంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న యూటర్న్‌ చిత్రాన్ని సమంత ఎంతో ఇష్టపడి, కష్టపడి చేసింది.ఇటీవలే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

దాంతో ఈ చిత్రం తప్పకుండా ఆకట్టుకుంటుందనే ఉద్దేశ్యంతో నిర్మాతలు మరియు దర్శకుడు నమ్మకంగా ఉన్నారు.ఇక ఈ చిత్రంపై నమ్మకంతో బయ్యర్లు భారీ మొత్తం పెట్టి మరీ ఈ చిత్రాన్ని కొనుగోలు చేయడం జరిగింది.

ఇక ఈ చిత్రంకు పోటీ శైలజ రెడ్డి అల్లుడు వస్తున్న కారణంగా సినిమాపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

శైలజ రెడ్డి అల్లుడు చిత్రంకు మారుతి దర్శకత్వం వహించడంతో పాటు అంచనాలు భారీగా ఉన్న కారణంగా ఖచ్చితంగా మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టగలదు.

అలా జరిగితే ‘యూటర్న్‌’ చిత్రం కలెక్షన్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది.అందుకే ఈ రెండు చిత్రాల విడుదల విషయంలో గత రెండు మూడు రోజులుగా చర్చ జరుగుతుంది.

ఈ రెండు చిత్రాల విడుదల ఇప్పుడు సమంత, నాగచైతన్యల వ్యక్తిగత వ్యవహారం వరకు వెళ్లింది.

తాజాగా నిర్మాతల మద్య ఒప్పందం కుదరడంతో నాగచైతన్య మరియు సమంతలు మాట్లాడుకుని ఇష్టపూర్తిగానే ఈ రెండు చిత్రాలను ఒకే రోజున విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.రెండు విభిన్నమైన కాన్సెప్ట్‌ చిత్రాలు అవ్వడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండానే సినిమాలు ఆడే అవకాశం ఉందని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.శైలజ రెడ్డి అల్లుడు చిత్రం విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube