స్కూల్ లో ఇచ్చే పనిష్మెంట్ల వెనక ఇంత కథ ఉందా.? బయట నించోపెట్టారంటే అర్ధం ఏం తప్పు చేసినట్టంటే.?

ఇరవై ఒకటవ శతాబ్దంలో విద్యార్థికి ‘నేర్చుకోవడమే’ విద్యా కార్యక్రమంలో కీలకం.

తల్లిదండ్రులు తమ పిల్లల్ని సాకటంలో ఎంత బాధ్యులో, ఉపాధ్యాయుడు కూడా వారిని సమాజంలో నిలిపేందుకు అంత బాధ్యత తీసుకుంటాడు.

బోధన సమర్థవంతంగా జరగాలంటే ఉపాధ్యాయుల సేవాతత్పరత అందుకు ఆయువుపట్టుగా నిలుస్తుంది.ఉపాధ్యాయులు ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుని, దాన్ని సులువుగా విద్యార్థులకు అందజేటంలోనే సేవాతత్పరత ఉందని అర్థం చేసుకోవాలి.

అదే అతని త్యాగనిరతికి నిదర్శనం.బిడ్డకు అన్నం తినిపించేటప్పుడు ప్రేమతో ఏ విధంగా తల్లి గోరుముద్దలు పెడుతుందో ఉపాధ్యాయుడు కూడా జ్ఞానాన్ని సులువుగా విద్యార్థి మెదడులోకి ఎక్కిస్తాడు.

ఇందుకు అతనికి నేర్పరితనం, సేవాతత్పరత ఉండాలి.దీన్ని సమాజం గుర్తించి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకిచ్చే సమాన స్థాయిని, గౌరవాన్ని అందించాలి.

Advertisement

గురువు సమాజానికి మార్గదర్శి.గురువు మార్గదర్శకత్వంలోనే సమాజంలో మార్పులు చోటుచేసుకుని ఆధునిక సమాజం ఏర్పడుతుంది.

అంధకారంలో కృత్రిమ సూర్యుడ్ని (విద్యుత్‌ బల్బు) కనిపెట్టిన థామస్‌ అల్వా ఎడిసన్‌, ఆకాశవాణిని (రేడియో) కనుగొన్న మార్కొని, దూరవాణి (టెలిఫోన్‌)ని కనుగొన్న గ్రహంబెల్‌ తదితర మేధావులందరూ వారి గురువుల మార్గదర్శకత్వంలో నడవడం ద్వారా ఆధునిక సమాజానికి పునాదులు వేశారు.

అయితే ఉపాధ్యాయుడు కొన్ని సార్లు పిల్లలకు శిక్ష వేస్తారు .విద్యార్థి చేసే తప్పుని బట్టి , తప్ప చేసినప్పుడు ఉపాధ్యాయుడు వివిధ రకాలుగా శిక్షిస్తాడు.దాని అర్థం కింది విధాలుగా ఉంటుంది.

మోకాళ్ల మీద కూర్చోబెడితే : వినయంగా ఉండాలని నోటి మీద వేలేసుకోమంటే : నీ గురించి నీవు గొప్పలు చెప్పుకోకూడదని చెవులు పట్టుకోమంటే :శ్రద్ధగా వినమని బెంచి ఎక్కి నిలబడమంటే : చదువులో నీవు అందరికంటే పైన ఉండాలని.చేతులెత్తి నిలబడమంటే : లక్ష్యం ఉన్నతంగా ఉండాలని.గోడవైపు చూస్తూ నిలబడమంటే : ఆత్మ పరిశీలన చేసుకోమని.ఉపాధ్యాయుడు విద్యార్థిని బయట నిలబెడితే : పరిసరాలను పరిశీలించి నేర్చుకోమని.బ్లాక్ బొర్డును తుడువమంటే : తప్పులన్నీ మరిచిపోయి, క్షమించి కొత్త పలుకలా ప్రారంభించాలని.ఏదైనా విషయాన్ని ఎక్కువసార్లు రాయమంటే : పర్‌ఫెక్షన్ కోసం ప్రయత్నించమని అర్థం.విద్యార్థి అనుభవించే ఏ శిక్ష అయినా పాజిటివ్ కోసం , పర్‌ఫెక్షన్ కోసం అని దయచేసి గుర్తించండి .దయచేసి ఉపాధ్యాయుడుని గౌరవించండి.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు