పుట్టినబిడ్డల బాగుకోసం కన్నతల్లి ఎంతటి కష్టానికైనా సిద్దపడుతుంది.ఆఖరికి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పిల్లలను రక్షించుకుంటుంది.
అగ్నిప్రమాదంలో చిక్కుకున్న తన ఇద్దరు పిల్లల్ని మంటల బారి నుండి రక్షించి,తను మాత్రం ఆ మంటల్లో బలైపోయింది.చైనాలోజరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరలై అందరూ ఆ తల్లి సమయస్పూర్తిని,త్యాగాన్ని వేనోళ్ల కొనియాడుతున్నారు.
చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తులో నివాసం ఉంటోంది.హఠాత్తుగా నాలుగో అంతస్తులో మంటలు వ్యాపించాయి.
పొరుగున ఉన్నవారు చూసినప్పటికీ ఎలా కాపాడాలో తోచలేదు.ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడంతో.
కిటికీలు తెరిచి ఇంట్లో ఉన్న దుప్పట్లను తీసి,కిటీకిలోనుండి కిందకు విసిరేసింది.ఇరుగుపొరుగు ఆ దుప్పట్లను వలలా పట్టుకోగా.9 ఏళ్లు, మూడేళ్ల వయసున్న తన ఇద్దరు పిల్లలను ఒకరి తర్వాత ఒకరిగా కిటికీలో నుంచి కిందకు విసిరేసింది.వారిద్దరూ స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు.
బిడ్డలను క్షేమంగా బతికించుకున్నప్పటికీ ఆమె మాత్రం మంటల నుంచి బయట పడలేకపోయింది.మంటల వేడికి అపాస్మరక స్థితిలోకి వెళ్లిపోయింది.సమాయానికి అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆమెను ఇంటిలోనుండి బైటికి తీసుకొచ్చి హాస్పిటల్‌కు తరలించారు.అయినప్పటికి లాభంలేకపోయింది.చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది.