నా నిశ్చితార్దానికి నన్ను పిలవండంటున్న హీరోయిన్..

ఝుమ్మందినాధం సినిమాతో టాలివుడ్ కి పరిచయం అయిన నటి తాప్సి పన్ను.దక్షిణాదిలో కొన్ని సినిమాలు చేసి తర్వాత బాలివుడ్ బాట పట్టింది.

అక్కడ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తాప్సి .ఇటీవల దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుని విమర్శించి తెలుగు ప్రేక్షకుల ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే ఇటీవల తాప్సి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఇంతకీ ఆ వార్త ఏంటి అంటే.తాప్సి పెళ్లి మ్యాటర్.

తాప్సి త్వరలో బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ మాథ్యూస్‌ బోయితో ఏడడుగులు వేస్తుందని ఒక వార్త షికారు చేస్తోంది.తాప్సీ ఎంగేజ్‌మెంట్‌ కోసమే ఆమె తల్లిదండ్రులు గోవా వెళ్ళారని,ఇప్పటికే కుటుంబ సభ్యులు పెళ్లి డేట్స్ ఫిక్స్ చేసేశారని వార్తలు వచ్చాయి.ఇదే విషయంపై తాప్సి స్పందించింది.

Advertisement

దీనిపై తాప్సీ స్పందిస్తూ నిజంగానా?.నా నిశ్చితార్థానికి నన్ను కూడా కాస్త పిలవండి.

మా తల్లిదండ్రులు గత పదేళ్ళుగా గోవా వెళ్ళలేదు.ఈ లెక్క ప్రకారం నాకు పదేళ్ల క్రితమే నిశ్చితార్థం జరిగిందని మీరూ ఊహించుకోవచ్చేమో అని పేర్కొంది.

నిప్పులేనిదే పొగరాదు.ఆ మధ్య శ్రియా కూడా ఇలాగే స్పందించింది.

నేను రష్యా వెళ్లింది షాపింగ్ కోసం.పెళ్లి విషయం గురించి కాదు అని.తీరా నెల తిరక్కుండానే తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ కొశ్చెవ్ ను పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది.చూద్దాం తాప్సి ఎలాంటి ట్విస్ట్ ఇస్తుందో.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?
Advertisement

తాజా వార్తలు