ఒక భార్య .భర్త ఎంతో అన్యోన్యంగా ఉండేవారు….
వారి అన్యోన్యతకు గుర్తుగా వారికి ఓ కుమార్తె పుట్టింది…….చాలా సంతోషంగా ఉన్నదాంట్లొనే ఎంతో తృప్తిగా ఉండేవారు…….
పాపకు నాలుగు సంవత్సరాల వయస్సు.ఆ పాప తల్లి ఒకరోజు తన కూతురితో
“నీకు ఒక తమ్ముడు పుడతాడు కొద్దిరోజుల్లో….నీవు వాడిని బాగా చూసుకోవాలి వాడితో గొడవపడకుండా బుద్ధిగా ఆడుకోవాలి .వాడికి ఏ లోటూ రాకుండా చూసుకోవాలి ” అని చెప్పింది….అప్పటినుండి ఆ పాప రోజూ అమ్మ నాన్నలను తమ్ముడు ఎప్పుడొస్తాడు అని అడుగుతూ ఉండేది…….తన తమ్ముని మీద ఎనలేని ప్రేమను అనురాగాన్ని పెంచుకోసాగింది…….
నెలలు నిండి ఆ తల్లి నిజంగానే ఓ మగ శిశువును ప్రసవించింది….కానీ….ఆ బిడ్డకు ఏదో తీవ్ర అనారోగ్యం వలన ఆ బిడ్డను ఇంటెంసివ్ కేర్లో ఉంచాల్సి వచ్చింది….ఈ పాపకేమో తన తమ్ముడిని చూడాలని ఆశగా ఉంది…కానీ ఆ గదిలోకి ఎవరినీ వెళ్ళనివ్వడంలేదు……అమ్మను అడిగింది….
వాళ్ళ నాన్నను బ్రతిమలాడింది……పాప నాన్న ఆ పాపను ఎత్తుకుని తమ్మునికి ఆరోగ్యం బాలేదు నువ్వుకూడా విసిగించకు అని మెల్లగా చెప్పాడు…….కానీ ఆ పాప అస్సలు వినడంలేదు……ఇలా అంది.
నాన్నా! ఒక్కసారి నాకు నా తమ్ముడిని చూపించండి.వాడిదగ్గరికి నన్ను తీసుకెళ్ళండి .వాడికి ఏమీ కాదు….ప్లీజ్ ,,,,,,,వాడితో నేను ఆడుకోవాలి.
నా తమ్ముడి దగ్గరికి ఎందుకు నన్ను తీసుకెళ్ళడంలేదు అని బిగ్గరగా ఏడ్చింది…….
ఆ పాప ఏడుపును ఆపకపోయేసరికి ………తండ్రి డాక్టరుదగ్గరికి వెళ్ళి మా బాబు బ్రతికి ఉంటాడో లేదో మాకు భయంగా ఉంది కనీసం ఈ పాపనైనా బ్రతికించుకోవాలి.బాబుని ఒక్కసారి పాపకు చూపించి తీసుకువస్తాను .దయచేసి అనుమతిని ఇవ్వండి….అని అడిగాడు…….
డాక్టర్లు కూడా ఆ పుట్టిన బిడ్డ పరిస్థితి సరిగ్గా లేదని.అసలు చలనమే లేదనీ చెప్పి………ఒక్కసారి ఆ పాపను తన తమ్ముని దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి అనుమతినిచ్చారు……పాప తన ఏడుపును ఆపి తన తమ్ముడిని చూడటానికి గదిలోకి వెళ్ళింది…….
” తమ్ముడూ! లెయ్యిరా! నేను నీ అక్కను……….అమ్మ నువ్వు వస్తావనీ నేను నిన్ను బాగా చూసుకోవాలని,,,,,నీతో బాగా ఆడుకోవాలని చెప్పింది.చాలా రోజులు ఎదురుచూశాను.ఇప్పుడు ఇలా పడుకుని ఉన్నావే! లెయ్ …….మనం ఆడుకుందాం ” అంటూ ఆ బాబు చేతివేళ్ళను మెత్తగా తాకింది…”
ఆశ్చర్యంగా ఆ పసిబిడ్డ కళ్ళు తెరిచి అలా చూసి ఏడుపు మొదలెట్టాడు.
అంతవరకు చలనమే లేని ఆ పసిబిడ్డ అలా ఏడవగానే డాక్టర్లు పరుగున ఆ గదిలోకి చేరుకుని ఇక ఆ బిడ్డకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు….
ఇది కట్టుకథ కాదు……ఒక పాప మనసులో తన తమ్ముడిపై పెంచుకున్న ప్రేమ అనురాగాలు ఖచ్చితంగా ఆ బిడ్డను చేరాయి….
ఆ బిడ్డ ప్రాణాలతో బయటపడ్డాడు…….వింతగా లేకపోయినా ఇందులో తెలుసుకోవలసిన అంశం ఉంది……పసిపిల్లల ప్రేమ………అనురాగం…….
నిజంగా ఆ దేవుడి ఆశీస్సులతో సమానం కదా!
.