బిగ్ బాస్ హౌస్ లో రోజురోజుకి హీట్ పెరుగుతుంది.నిన్నటి ఎపిసోడ్ లో ఊహించని విధంగా యాంకర్ శ్యామల ఎలిమినేట్ అయ్యారు.
ఉదయం నుండి సోషల్ మీడియాలో ఎంతో మంది శ్యామల ఎలిమినేట్ అయ్యింది పోస్ట్ లు పెట్టారు.కానీ అభిమానులు అది నమ్మలేదు.
ఎందుకంటే లేడీ రేలంగి మావయ్య లాంటి శ్యామల గారు ఎలిమినేట్ అవ్వడం ఏంటి అని కామెంట్స్ పెట్టారు.కానీ చివరకు అదే నిజం అయ్యింది.
హౌస్‌లో మీకు ఎవరు విలన్‌లా కనిపిస్తారో చెప్పాలంటూ ‘విలన్’ గేమ్ ఆడించారు.ఈ సందర్బంగా గీతా మాధురీ, కౌశల్ తనీష్‌ను విలన్‌గా పేర్కొన్నారు.తనీష్, దీప్తి సునైనా, గణేష్.కౌశల్‌ను; సామ్రాట్, బాబుగోగినేని, నందిని.
రోల్ రైడాను; రోల్.సామ్రాట్‌ను; కౌశల్, గీతా.
తనీష్‌ను; తేజస్వీ.అమిత్‌ను, శ్యామల, అమిత్.
గీతాను, దీప్తి.శ్యామాలను విలన్లుగా ఎంపిక చేసుకుని కిరీటం పెట్టారు.

ఎలిమినేషన్‌లో బాబుగోగినేని, తేజస్వీలు సేఫ్‌జోన్‌లోకి వెళ్లగా.నందిని, శ్యామల, దీప్తీలు చివరిలో మిగిలారు.వీరిలో ఎవరు బయటకు వెళ్లాలనేది బిగ్‌బాస్ నిర్ణయిస్తాడని నాని తెలిపారు.దీంతో, బిగ్‌బాస్ ఆ ముగ్గురిలో ఒకరిని బయటకు పంపే అవకాశాన్ని తేజస్వి, కౌశల్‌కు ఇచ్చారు.వీరు శ్యామలాను బయటకు పంపాలని నిర్ణయించారు.శ్యామలా ఎలిమినేట్ కావడంతో దీప్తీ కన్నీరు మున్నీరైంది.
వెళ్తూ వెళ్తూ బిగ్ బాంబును దీప్తీపై వేసింది శ్యామలా.దీని ప్రకారం వారమంతా హౌస్‌మేట్స్ దుస్తులన్నీ దీప్తి ఉతకాలి.ఇది ఇలా ఉంటె.
శ్యామలపై సోషల్‌మీడియాలో అభిమానం వెళ్లువెత్తుతోంది.ఎలిమినేట్ అనంతరం శ్యామల చేసిన పోస్టు వైరల్‌గా మారింది.
‘బై బై బిగ్ బాస్.ఇట్స్ టైమ్ టు ఇషాన్.
బిగ్ బాస్‌లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది.నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.
అల్ మై ప్రేయర్స్ టు మై హేటర్స్.లవ్ యు అల్’ అని పోస్టు చేశారు.
ఆ పోస్ట్ కు ఎంతో మంది అభిమానులు స్పందించారు.కొందరైతే ఇక మేము బిగ్ బాస్ చూడము అన్నారు.మరి కొందరు మీరు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మళ్లీ రావాలి అన్నారు.చూసుకుంటే శ్యామలకు మంచి ఫోలివింగ్ ఉందని తెలుస్తుంది.







