పూరి తర్వాత సినిమా ఫిక్స్‌.. మళ్లీ అదే తప్పు

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ గత కొంత కాలంగా ఆశించిన స్థాయిలో మంచి చిత్రాలను తీయడంలో విఫలం అవుతున్నాడు.ఏమాత్రం ఆకట్టుకోని కథ, కథనాలతో మూస తరహాలో సినిమాలను తెరకెక్కిస్తూ పూరి వరుసగా ఫ్లాప్‌ అవుతూ వస్తున్నాడు.

 Again Puri Doing Same Fault-TeluguStop.com

ఇటీవల ఈయన దర్శకత్వంలో వచ్చిన ‘పైసా వసూల్‌’ మరియు ‘మెహబూబా’ చిత్రాలు అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాయి.పూరి మార్క్‌ ఆ చిత్రాల్లో ఏమాత్రం కనిపించలేదు.

ఎన్నో చిత్రాలతో సక్సెస్‌లను దక్కించుకున్న పూరి జగన్నాధ్‌, ఎంతో మంది హీరోలకు లైఫ్‌ ఇచ్చాడు.కాని తన కొడుకుకు మాత్రం సక్సెస్‌ ఇవ్వడంలో విఫలం అయ్యాడు.

కొడుకుని హీరోగా నిలబెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి ‘మెహబూబా’ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో పూరి నిర్మించిన విషయం తెల్సిందే.ఆ చిత్రంతో పూరికి ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి.ఇల్లు అమ్మి మరీ సినిమాను తెరకెక్కించగా, ఆ చిత్రం తీవ్ర నిరాశను మిగిల్చింది.పెట్టిన పెట్టుబడిలో కనీసం సగం కూడా వసూళ్లు రాబట్టలేక పోయింది.ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పూరి తన తదుపరి చిత్రాన్ని వేరే హీరోతో, బయట బ్యానర్‌లో చేయాలని భావించాడు.అయితే ఈయన దర్శకత్వంలో నటించేందుకు ఏ హీరో కూడా ఆసక్తి చూపడంలేదు.

ఇక ఏ నిర్మాత కూడా ఈయనపై పెట్టుబడికి ఆసక్తి చూపడం లేదు.

ఇతరులపై ఆధారపడకుండా మరోసారి తన సొంత బ్యానర్‌లోనే చిత్రాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు.

మరోసారి తన కొడుకుతోనే చిత్రాన్ని తెరకెక్కించాలనే నిర్ణయానికి దర్శకుడు పూరి వచ్చినట్లుగా తెలుస్తోంది, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికి ఏమాత్రం లెక్క పెట్టకుండా తాను అనుకున్న విధంగా కొడుకుతో సినిమాను ప్లాన్‌ చేస్తున్నాడు.పూరి సన్నిహితులు మరియు ఇతరులు కూడా ఆకాష్‌తో ప్రస్తుతానికి సినిమా వద్దని, అసలు ప్రస్తుతం సొంత బ్యానర్‌లో చిత్రం చేయకుంటేనే బెటర్‌ అంటూ సలహా ఇస్తున్నారు.

కాని పూరి మాత్రం తన ప్రతిభను నమ్ముకుని సినిమా చేయాలని ఫిక్స్‌ అయ్యాడు.

ఆకాష్‌ పూరి మొన్నటి వరకు బాల నటుడిగా నటించాడు.

ఎన్నో చిత్రాల్లో బాల నటుడిగా నటించిన పూరి ఆకాష్‌ను ఇప్పటికిప్పుడు ప్రేక్షకులు హీరోగా స్వీకరించలేక పోతున్నారు.అందుకే మెహబూబా చిత్రంలో ఆకాష్‌ పూరి ుక్‌పై విమర్శలు వచ్చాయి.

హీరోయిన్‌కు తమ్ముడిగా ఉన్నాడని, చిన్న కుర్రాడు అంటూ అంతా అన్నారు.హీరో అయ్యే వయస్సు ఇంకా పూరికి రాలేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఎవరేం అన్నా కూడా పూరి మాత్రం తన పని తాను చేసుకు పోతున్నాడు.కొడుకు కోసం మరో ప్రేమ కథను సిద్దం చేశాడు.

అతి త్వరలోనే స్వీయ దర్శకత్వంలో సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్దం అవుతున్నాడు.దీంతో పూరి మళ్లీ అదే తప్పు చేస్తున్నాడని, ఇది ఫలితం తారుమారు అయితే పూరి కోలుకోవడం కష్టం అంటూ సినీ వర్గాల వారు జోష్యం చెబుతున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube