బీజేపీ తో పొత్తు లేనట్లే..జగన్ మాటల్లో అంతర్యం ఏమిటి.?

వైసీపి అధినేత జగన్ మోహన్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఘలక్ ఇచ్చారు.గడిచిన కొన్ని నెలలుగా చంద్రబాబు జగన్ పై చేస్తున్న ప్రధాన ఆరోపణలకి జగన్ చెక్ పెట్టారు.వచ్చే ఎన్నికల్లో బీజేపీ వైసీపి కలుస్తాయని వీరిద్దరికీ తోడుగా జనసేన కూడా కలుస్తుందని ఇన్ని యుక్తులు పన్నేది కేవలం తెలుగుదేశం పార్టీని ఓడించడానికే అంటూ చంద్రబాబు పదేపదే చేస్తున్న ఆరోపణలు ఒక్క సారిగా జగన్ ప్రకటనతో వీగిపోయాయి.2019 ఎన్నికల్లోపు ఏ పార్టీతోనూ పొత్తులుండవని.అసలు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా తమకు లేదని జగన్ తేల్చేశారు.

 Jagan Thinking About Bjp Alliance-TeluguStop.com

అయితే గతంలో చెప్పినట్టుగా కేంద్రంలో ఎవరు ప్రత్యేక హోదాకి కట్టుబడి ఉంటారో వారికే తమ మద్దతు ఉంటుంది అంటూ మరో సారి ముక్కుసూటుగా చెప్పేశారు…జగన్ తాజా బీజేపీ తో గానీ జనసేనతోన గాని పొత్తు ఉంటుందని జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లే.ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో ప్రత్యేకహోదా.వైఎస్ఆర్ పాలన పునరుధ్ధరణ, చంద్రబాబునాయుడు పాలనను తరిమికొట్టట ప్రధాన అజెండాగా జగన్ స్పష్టంగా చెప్పారు.

అయితే బాబు గత ఎన్నికల్లో ఇచ్చిన అబద్దపు హామీలు.అబద్దపు ప్రచారాలు నమ్మి ప్రజలు ఓట్లు వేశారని అయితే.తన అబద్దపు హామీలకు నరేంద్రమోడి హవా, పవన్ కల్యాణ్ కూడా ఊతంగా నిలిచినట్లు తెలిపారు.అయితే ముందస్తు పై జగన్ మాట్లాడుతూ ప్రత్యేకంగా సిద్దం అవ్వడానికి ఏమి లేదు మేము ఎప్పుడు సిద్దంగానే ఉన్నామని అన్నారు.

ముందస్తు వస్తే మాత్రం తప్పకుండా వైసీపికి ,ఏపీలో మంచే జరుగుతుందని జగన్ అభిప్రాయపడ్డారు.

అయితే మీడియా ప్రతినిధి అడిగిన ఒక ప్రశ్నకి బదులుగా జగన్ మాట్లాడుతూ గత ఎన్నికలో బీజేపి ,జగన్ లవలన చీలిన ఓట్లు మాత్రమే టీడీపీ కి వెళ్లాయని.

అప్పట్లో అందరూ కలిసి ఉన్నారు కాబట్టి విజయం అటు వరించింది అయితే ఈ సారి మాత్రం ఎవరికీ వారు పోటీ చేస్తారు ఎవరు ఓటింగ్ వారికి ఉంటుంది అదే సమయంలో వైసీపీ ఓటింగ్ చెక్కు చెదరదు అంటూ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.అసలు జాతీయ రాజకీయల గురించి ఆలోచించడం లేదని జగన్ తెలిపారు.

అయితే జగన్ మొత్తం ఇంటర్వ్యూ ని పరిశీలిస్తే గెలుపుపై తానూ ఎంతో నమ్మకంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.ఏపీలో ఊహించని స్థాయిలో వైసీపి గెలుపు ఒంటరిగానే సాధిస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube